IND vs ENG 1st ODI Toss: తొలి వన్డేలో టాస్ ఓడిన టీమిండియా - ఇంగ్లండ్ బ్యాటింగ్ - గాయంతో కోహ్లి ఔట్!
IND vs ENG 1st ODI Toss: టీమిండియాతో జరుగుతోన్న తొలి వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్ ద్వారా వన్డే క్రికెట్‌లోకి యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా ఎంట్రీ ఇచ్చారు. మోకాలి గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు కోహ్లి దూరమయ్యాడు.

IND vs ENG 1st ODI Toss: ఇంగ్లండ్‌తో వన్డే పోరుకు టీమిండియా రెడీ అయ్యింది. నాగ్‌పూర్ వేదికగా ఇండియా, ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే నేడు జరుగుతోంది. ఈ ఫస్ట్ వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది.
టీ20లో ఇంగ్లండ్‌ను చితకొట్టిన అభిషేక్ శర్మ, శివమ్ దూబేతో పాటు పలువురు యంగ్ ప్లేయర్లకు వన్డే సిరీస్‌లో చోటు దక్కలేదు. యంగ్ టీమ్ అందించిన స్ఫూర్తిని సీనియర్లు కొనసాగిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
కోహ్లి దూరం...
ఈ మ్యాచ్‌కు కోహ్లి గాయం కారణంగా దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా కోహ్లి ఈ మ్యాచ్ ఆడటం లేదని రోహిత్ శర్మ ప్రకటించాడు. మోకాలి గాయంతో విరాట్ ఇబ్బంది పడుతున్నట్లు మంగళవారం రాత్రి తెలిసిందని రోహిత్ అన్నాడు. అందుకే అతడు ఈ మ్యాచ్‌కు దూరమైనట్లు వెల్లడించాడు.
యశస్వి జైస్వాల్ ఎంట్రీ...
నాగ్‌పూర్ మ్యాచ్ ద్వారా వన్డే క్రికెట్‌లోకి టీమిండియా తరఫున యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా ఎంట్రీ ఇచ్చారు. జైస్వాల్‌తో కలిసి రోహిత్ శర్మ ఇండియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతున్నాడు. పంత్‌ను కాదని వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌వైపే టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపింది.
టీ20 సిరీస్‌లో అదరగొట్టిన వరుణ్ చక్రవర్తికి స్థానం దక్కలేదు. సీనియారిటీ ప్రాధాన్యతనిచ్చారు.మరోవైపు జో రూట్ చేరికతో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ బలంగా మారింది. ముగ్గురు పేసర్లు, ఓ స్పిన్నర్‌తో ఇంగ్లండ్ ఆడుతోంది.
టీమిండియా తుది జట్టు ఇదే
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్య,కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.
ఇంగ్లండ్ టీమ్
బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్, జో రూట్, హ్యారీ బ్రూక్, బట్లర్, లివింగ్‌స్టోన్, జాకబ్ బెథల్, బ్రైడన్ కర్స్, ఆర్చర్, ఆదిల్ రషీద్, సఖీబ్ మహమ్మద్.