india vs england 3rd odi: టాస్ మళ్లీ ఇంగ్లండ్ దే.. ఈ సారి టీమ్ఇండియా బ్యాటింగ్.. షమి, జడేజాకు రెస్ట్.. వరుణ్ ఔట్
india vs england 3rd odi: ఇంగ్లండ్ తో సిరీస్ లో చివరిదైన మూడో వన్డేలో భారత్ మొదట బ్యాటింగ్ చేయబోతోంది. టాస్ గెలిచిన బట్లర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది.

అహ్మదాబాద్ లో బుధవారం (ఫిబ్రవరి 12) జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయబోతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. రెండో ఇన్నింగ్స్ లో మంచు ప్రభావం నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ టాస్ నెగ్గగానే బౌలింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ లో మూడు మార్పులతో భారత్ బరిలో దిగింది.
షమి, జడేజా కు రెస్ట్
మూడో వన్డేకు భారత్ మూడు మార్పులు చేసింది. పేసర్ మహమ్మద్ షమి, స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కు రెస్ట్ నిచ్చారు. మరోవైపు గాయంతో వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. ఈ ముగ్గురి ప్లేస్ ల్లో స్పిన్నర్లు కుల్ దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, పేసర్ అర్ష్ దీప్ ను ఆడిస్తున్నారు.
ఇంగ్లండ్ ఓ ఛేంజ్ తో
రెండో వన్డేలో ఆడిన జట్టులో ఇంగ్లండ్ ఓ ఛేంజ్ చేసింది. జెమీ ఓవర్టన్ ప్లేస్ లో టామ్ బాంటన్ ను తీసుకుంది. వరుసగా తొలి రెండు వన్డేల్లోనూ ఓడిన ఇంగ్లండ్ 0-2తో సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలిచి క్లీన్ స్వీప్ పరాభావాన్ని తప్పించుకోవాలని ఆ జట్టు చూస్తోంది.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ, శుభ్ మన్, కోహ్లి, శ్రేయస్, హార్దిక్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్ దీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్
ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, బట్లర్, బాంటన్, లివింగ్ స్టన్, అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సకీబ్ మహ్మూద్
సంబంధిత కథనం