India vs england 2nd Odi: కోహ్లి వచ్చేశాడు.. టాస్ ఓడిన భారత్.. ఇంగ్లండ్ బ్యాటింగ్.. వరుణ్ అరంగేట్రం
India vs england 2nd Odi: కటక్ లో భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మోకాలి వాపుతో గత మ్యాచ్ కు దూరమైన కోహ్లి తిరిగొచ్చాడు. జైస్వాల్ పై వేటు తప్పలేదు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వన్డే అరంగేట్రం చేయబోతున్నాడు.

రెండో వన్డేలో ఆడనున్న విరాట్ (AFP)
ఇంగ్లండ్ బ్యాటింగ్
కటక్ లోని బారాబతి స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వన్డేతో పోలిస్తే ఆ జట్టు ఫైనల్ ఎలెవన్ లో మూడు మార్పులు చేసింది. పేసర్లు మార్క్ వుడ్, అట్కిన్సన్, ఆల్ రౌండర్ ఒవర్టన్ ఈ మ్యాచ్ లో ఆడుతున్నారు. ఆర్చర్, బెతెల్, కార్స్ ను పక్కనపెట్టారు.
కోహ్లి ఇన్.. జైస్వాల్ ఔట్
వరుణ్ అరంగేట్రం
స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ తో వన్డేలోనూ అరంగేట్రం చేస్తున్నాడు. గత కొంతకాలంగా టీ20ల్లో నిలకడగా రాణిస్తున్న అతనికి టీమ్ మేనేజ్ మెంట్ వన్డేల్లోనూ అవకాశం కల్పించింది. సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా నుంచి వరుణ్ వన్డే క్యాప్ అందుకున్నాడు. కుల్ దీప్ యాదవ్ కు రెస్ట్ ఇచ్చి ఈ మ్యాచ్ లో వరుణ్ ను ఆడిస్తున్నారు.
తుదిజట్లు
భారత్: రోహిత్, శుభ్ మన్, కోహ్లి, శ్రేయస్, కేెఎల్ రాహుల్, హార్దిక్, జడేజా, అక్షర్, హర్షిత్ రాణా, షమి, వరుణ్ చక్రవర్తి
ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, డకెట్, రూట్, హ్యారీ బ్రూక్, బట్లర్, లివింగ్ స్టన్, ఒవర్టన్, అట్కిన్సన్, అడిల్ రషీద్, మార్క్ వుడ్, సకీబ్ మహ్మూద్
సంబంధిత కథనం