Champions Trophy: బజ్ బాల్ గేమ్.. స్టార్ జట్టు.. ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షే.. ఈ సారి ఇంగ్లండ్ కొట్టేనా?-england swot analysis champions trophy 2025 buttler mccullum archer root ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Champions Trophy: బజ్ బాల్ గేమ్.. స్టార్ జట్టు.. ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షే.. ఈ సారి ఇంగ్లండ్ కొట్టేనా?

Champions Trophy: బజ్ బాల్ గేమ్.. స్టార్ జట్టు.. ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షే.. ఈ సారి ఇంగ్లండ్ కొట్టేనా?

Champions Trophy: రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్. ఖాతాలో వన్డే, టీ20 ప్రపంచకప్. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షే. మరి స్టార్ ఆటగాళ్లతో నిండిన ఇంగ్లండ్ ఈ సారి సాధిస్తుందా?

ఇప్పటివరకూ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవని ఇంగ్లండ్ (REUTERS)

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ ను బ్యాడ్ లక్ వెంటాడుతోంది. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఈ టోర్నీలో ఆ జట్టు విజేతగా నిలవలేదు. 2004, 2013లో ఫైనల్లో ఓడి రన్నరప్ గా నిలిచింది. ఈ సారి మాత్రం కప్ తో నిరీక్షణకు ముగింపు పలకాలనే లక్ష్యంతో ఉంది. కానీ అదంత సులువేం కాదు. ఇంగ్లండ్ 2019 వన్డే ప్రపంచకప్, 2010, 2022 టీ20 ప్రపంచకప్ ఛాంపియన్.

బ్యాటింగ్ బలం

బ్యాటింగ్ లో ఇంగ్లండ్ బలంగా ఉంది. డకెట్, ఫిల్ సాల్ట్, బట్లర్, హ్యారీ బ్రూక్, లివింగ్ స్టన్ ధనాధన్ షాట్లు ఆడగలరు. సీనియర్ బ్యాటర్ రూట్ కు ఇన్నింగ్స్ కు వెన్నెముకలా నిలిచే సామర్థ్యం ఉంది. ఆ జట్టుకు లివింగ్ స్టన్, కార్స్, ఒవర్టన్ లాంటి ఆల్ రౌండర్ల అండ కూడా ఉంది.

బజ్ బాల్ గేమ్

కోచ్ గా మెక్ కలమ్ వన్డే జట్టుపై ఇంకా తన ముద్ర వేయలేకపోయాడు. టెస్టుల్లో అతని కోచింగ్ లో ఇంగ్లండ్ బజ్ బాల్ గేమ్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ మెక్ కలమ్ కోచింగ్ లో ఇంగ్లండ్ సరికొత్త ఆటతీరుతో టైటిల్ దిశగా సాగుతుందనే అంచనాలున్నాయి.

ఇంగ్లండ్ వన్డే కెప్టెన్ గా తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమైన మెక్ కలమ్
ఇంగ్లండ్ వన్డే కెప్టెన్ గా తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమైన మెక్ కలమ్ (PTI)

అదే బలహీనత

ఇంగ్లండ్ సమష్టిగా రాణించలేకపోతోంది. కొంతమంది ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన తప్ప జట్టుగా ఇంగ్లండ్ ఫెయిల్ అవుతోంది. 2023 ప్రపంచకప్ తర్వాత ఇంగ్లండ్ ఆడిన 13 వన్డేల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. వరుసగా నాలుగు సిరీస్ ఓటములతో ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగుపెడుతోంది. ఇటీవల భారత్ లో 0-3తో వైట్ వాష్ కు గురైంది.

గాయాల దెబ్బ

ఇంగ్లండ్ జట్టునూ గాయాల సమస్య వెంటాడుతోంది. స్టార్ పేసర్లు ఆర్చర్, మార్క్ వుడ్ గాయాలతోనే టోర్నీకి సిద్ధమవుతున్నారు. ఆల్ రౌండర్ బెతెల్ గాయంతో ఈ టోర్నీకి దూరమయ్యాడు. స్పిన్ విభాగమూ వీక్ గా ఉంది. ఏకైక స్పిన్నర్ గా ఆదిల్ రషీద్ జట్టులో ఉన్నాడు. రూట్, లివింగ్ స్టన్ పార్ట్ టైమ్ స్పిన్నర్లుగా ఉపయోగపడగలరు.

ఇంగ్లండ్ జట్టు: బట్లర్ (కెప్టెన్), ఆర్చర్, అట్కిన్సన్, బాంటన్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, డకెట్, ఒవర్టన్, జేమీ స్మిత్, లివింగ్ స్టన్, ఆదిల్ రషీద్, జో రూట్, సకీబ్ మహ్మూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం