India vs England 2nd odi live: రూట్, డకెట్ హాఫ్ సెంచరీలు.. భారత్ ముందు భారీ టార్గెట్
India vs England 2nd odi live: కటక్ లో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ కు ఇంగ్లండ్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 304 పరుగులకు ఆలౌటైంది. రూట్, డకెట్ అర్ధసెంచరీలు చేశారు. జడేజా మూడు వికెట్లతో మెరిశాడు.

ఇంగ్లండ్ భారీ స్కోరు
భారత్ తో రెండో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. రూట్ (69), డకెట్ (65) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. లివింగ్ స్టన్ (41) కూడా రాణించాడు. భారత బౌలర్లలో జడేజా (3/35) మూడు వికెట్లతో రాణించాడు. మధ్యలో భారత్ వికెట్లు పడగొట్టినా.. బ్యాటర్ల సమష్టి ప్రదర్శనతో ఇంగ్లండ్ స్కోరు 300 దాటింది.
జడ్డూ మాయ
టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా (3/35) వరుసగా రెండో వన్డేలోనూ మూడు వికెట్లతో సత్తాచాటాడు. నాగ్ పుర్ లో జరిగిన తొలి వన్డేలోనూ అతను మూడు వికెట్లతో ఇంగ్లండ్ ను కట్టడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కటక్ లోనూ జడ్డూ ఫామ్ కొనసాగించాడు. మధ్య ఓవర్లలో టైట్ లెంగ్త్ లతో బ్యాటర్లకు పరుగులు చేసే ఫ్రీడమ్ ఇవ్వలేదు. కీలకమైన డకెట్, రూట్ తో పాటు ఒవర్టన్ (6)ను వికెట్లను జడ్డూ ఖాతాలో వేసుకున్నాడు.
రూట్, డకెట్ హాఫ్ సెంచరీలు
జో రూట్ (69), బెన్ డకెట్ (65) హాఫ్ సెంచరీలతో ఇంగ్లండ్ భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు. హ్యారీ బ్రూక్ (31), కెప్టెన్ బట్లర్ (34), లివింగ్ స్టన్ (41) కూడా రాణించారు. చివర్లో అడిల్ రషీద్ (14) షమి బౌలింగ్ లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. భారత బౌలర్లలో షమి, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్య, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ పడగొట్టారు.
సంబంధిత కథనం