England Captain: ఇంగ్లండ్ కెప్టెన్ ప్రస్టేషన్ - అంపైర్లతో రచ్చ - సోషల్ మీడియాలో ట్రోల్స్
England Captain: ఇంగ్లండ్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ హీతర్ నైట్ గ్రౌండ్‌లోనే రచ్చ చేసింది. అంపైర్ల నిర్ణయం వల్ల తమ జట్టు ఓడిపోయిందనే ప్రస్టేషన్‌ను కంట్రోల్ చేసుకోలేకపోయింది. బ్యాట్ విసరేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా అంపైర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించింది.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతోన్న ఉమెన్స్ యాషెస్ టోర్నీ సెకండ్ టీ20 మ్యాచ్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రెండో టీ20లో అంపైర్లు తీసుకున్న నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ హీతర్ నైట్ ప్రస్టేషన్‌ను కంట్రోల్ చేసుకోలేకపోయింది. కోపంతో బ్యాట్ విసరేసి రచ్చ చేసింది. అంతటితో ఆగిపోకుండా మ్యాచ్ ముగిసిన అనంతరం అంపైర్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించింది.
ఆస్ట్రేలియా విన్...
ఇంతకీ హీటర్ నైట్ ప్రస్టేషన్‌కు కారణం ఏమిటంటే? ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 మ్యాచ్ ఓవల్ స్టేడియం వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఆస్ట్రేలియా ఆరు పరుగులు తేడాతో గెలిచింది.
185 రన్స్...
ఈ టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 185 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనే 31 బాల్స్‌లో ఏడు ఫోర్లతో 44 పరుగులు చేసింది. చివరలో కెప్టెన్ మెక్‌గ్రాత్ 35 బాల్స్‌లో ఎనిమిది ఫోర్లతో 48 రన్స్, గ్రేస్ హరీస్ 17 బాల్స్‌లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో 35 రన్స్ చేయడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది.
చివరి ఓవర్‌లో...
లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ గట్టిగానే పోరాడింది. డానియల్ హోడ్జ్ 40 బాల్స్‌లో ఎనిమిది ఫోర్లతో 52 రన్స్, సోఫియా డంక్లీ 22 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 రన్స్ చేయడంలో ఇంగ్లండ్ విజయం దిశగా సాగింది. కెప్టెన్ హీతర్ నైట్ కూడా దంచి కొట్టడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. చివరి ఓవర్‌లో విజయానికి 22 పరుగులు అవసరమైన టైమ్‌లో ఫస్ట్ బాల్‌కే హీతర్ ఫోర్ కొట్టింది. మరో ఐదు బాల్స్‌లో 18 పరుగులు చేస్తే ఇంగ్లండ్ విన్ అవుతుంది. కానీ అప్పుడే మ్యాచ్‌లో ఊహించని ట్విస్ట్ మొదలైంది.
వర్షం కారణంగా...
వర్షం కురవడం స్టార్ట్ కావడంతో అంపైర్లు మ్యాచ్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ కొనసాగించే అవకాశం ఉందని హీతర్ వాదించిన కూడా అంపైర్లు ఆమె మాటలను పట్టించుకోలేదు.
అంపైర్ల నిర్ణయంతో హీతర్ ప్రస్టేట్ అయ్యింది. తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయింది. నోటికి పని చెబుతూనే మైదనాన్ని వీడింది. బ్యాట్ విసిరికొట్టింది. వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం లేకపోవడంతో ఆస్ట్రేలియాను విజేతగా ప్రకటించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం అంపైర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి హీతర్ నిరాకరించింది. అంపైర్ హేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేతిని ముందుకు చాచినా పట్టించుకోనట్లుగా వెళ్లిపోయింది. అంపైర్లకు మాత్రమే కాకుండా ఆస్ట్రేలియన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.
ట్రోల్స్...
హీతర్ ప్రవర్తనపై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు. అంపైర్లతో హీతర్ ప్రవర్తన అనుచితంగా ఉందని, షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వారిని అవమానించిందంటూ ట్రోల్స్ చేస్తోన్నారు. హీతర్ నైట్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోన్నారు.