England create history: వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా.. ఇంగ్లండ్ బ్యాటర్ల అరుదైన ఘనత-england create history in world cup match against new zealand cricket news in telugu ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  England Create History In World Cup Match Against New Zealand Cricket News In Telugu

England create history: వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా.. ఇంగ్లండ్ బ్యాటర్ల అరుదైన ఘనత

Hari Prasad S HT Telugu
Oct 05, 2023 07:42 PM IST

England create history: వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా జరిగింది. ఇంగ్లండ్ బ్యాటర్లు ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. న్యూజిలాండ్ తో జరిగిన వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ టీమ్ లోని 11 మంది బ్యాటర్లూ రెండంకెల స్కోరు చేశారు.

ఇంగ్లండ్ టీమ్ లో టాప్ స్కోరర్లుగా నిలిచిన జోస్ బట్లర్, జో రూట్
ఇంగ్లండ్ టీమ్ లో టాప్ స్కోరర్లుగా నిలిచిన జోస్ బట్లర్, జో రూట్ (AP)

England create history: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 తొలి మ్యాచ్ లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆ టీమ్ లోని మొత్తం 11 మంది బ్యాటర్లూ రెండంకెల స్కోరు చేశారు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకూ ఎప్పుడూ ఇలా జరగలేదు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాటర్లు చరిత్ర పుటల్లోకి ఎక్కారు.

ట్రెండింగ్ వార్తలు

నిజానికి ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాటర్లు అనవసర షాట్లకు పోయి వికెట్లు పారేసుకున్నారు. కానీ టీమ్ లోని మొత్తం 11 మంది బ్యాటర్లకూ బ్యాటింగ్ చేసే అవకాశం రావడం.. అందరూ రెండంకెల స్కోర్లు అందుకోవడం నిజంగా విశేషమే. ఇంగ్లండ్ టీమ్ లో జో రూట్ 77 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ జోస్ బట్లర్ 43 పరుగులు చేశాడు.

ఇక ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో 22, డేవిడ్ మలన్ 14, హ్యారీ బ్రూక్ 25, మొయిన్ అలీ 11, లివింగ్‌స్టోన్ 20, సామ్ కరన్ 14, క్రిస్ వోక్స్ 11, ఆదిల్ రషీద్ 15, మార్క్ వుడ్ 13 పరుగులు చేశారు. నిజానికి ఇంగ్లండ్ 45.4 ఓవర్లలో 252 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. అయితే చివరి వికెట్ కు రషీద్, వుడ్ 30 పరుగులు జోడించి ఇంగ్లండ్ కు మంచి స్కోరు అందించారు.

ఇలా ఓ జట్టులోని మొత్తం 11 మంది బ్యాటర్లు రెండంకెల స్కోర్లు చేయడం మెన్స్, వుమెన్స్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఇంగ్లండ్ బ్యాటింగ్ కు దిగింది. అయితే తొలి బంతికే సిక్స్ కొట్టి జానీ బెయిర్‌స్టో వరల్డ్ కప్ కు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చినా.. ఆ ఆరంభాన్ని బెయిర్‌స్టో కానీ, ఇతర బ్యాటర్లు కానీ సద్వినియోగం చేసుకోలేకపోయారు.

క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్ వచ్చీ రాగానే భారీ షాట్లు ఆడటానికి ప్రయత్నించారు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. ఇంగ్లండ్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకొని భారీ స్కోరు కోసం ప్రయత్నించలేదు. ఒక్క రూట్ మాత్రమే బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు.

WhatsApp channel