టీమిండియాతో సొంతగడ్డపై సిరీస్ కోసం ఇంగ్లాండ్ సన్నాహకాలు మొదలెట్టింది. దాని హోం గ్రౌండ్ లో ఇండియాను ఓడించడమే లక్ష్యంగా ఇంగ్లాండ్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జూన్ 20న హెడింగ్లీలో ప్రారంభమయ్యే తొలి టెస్టు కోసం ఇంగ్లాండ్ 14 మంది ఆటగాళ్ల జట్టును ప్రకటించింది. బెన్ స్టోక్స్ జట్టుకు నాయకత్వం వహిస్తారు.
టీమిండియాను కట్టడి చేసేందుకు పేసర్ జేమీ ఓవర్టన్ ను ఇంగ్లాండ్ టీమ్ టెస్టులకు ఎంపిక చేసింది. మూడు సంవత్సరాల తర్వాత ఓవర్టన్ తిరిగి టెస్టు టీమ్ కు ఎంపికవడం గమనార్హం. ఓవర్టన్ ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్ట్ మాత్రమే ఆడాడు. అది 2022లో న్యూజిలాండ్‌తో. తాజాగా జింబాబ్వేతో జరిగిన టెస్ట్‌లో గాయపడిన అట్కిన్సన్ ఇండియాతో తొలి టెస్టుకు ఇంగ్లాండ్ టీమ్ లో చోటు దక్కించుకోలేకపోయాడు.
సీమ్, స్వింగ్ కు అనుకూలించే సొంత గడ్డపై ఇండియాను పేస్ తో దెబ్బకొట్టేందుకు ఇంగ్లాండ్ రెడీ అవుతోంది. అందుకే ఫస్ట్ టెస్టు కోసం టీమ్ లోకి ఏకంగా నలుగురు పేసర్లను తీసుకుంది. క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, ఓవర్టన్, జోష్ టంగ్ తో పేస్ దాడి పదునెక్కనుంది. షోయబ్ బషీర్ ఏకైక స్పిన్నర్‌గా ఉన్నాడు. గత నెలలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌ను మిస్ అయిన జాకబ్ బెథెల్ కూడా టెస్ట్ జట్టుకు తిరిగి వచ్చాడు.
14 మందితో కూడిన జట్టులో జాక్ క్రావ్లీ, బెన్ డకెట్, ఒలీ పోప్ ఉన్నారు. వీరు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన శతకాలు సాధించారు. జింబాబ్వే టెస్ట్‌లో ఆడినట్లుగా జేమీ స్మిత్ ఇండియాతో మ్యాచ్ ల్లోనూ వికెట్ కీపర్‌గా కొనసాగుతారని భావిస్తున్నారు.
బెన్ స్టోక్స్ (డర్హామ్) – కెప్టెన్, షోయబ్ బషీర్ (సోమర్‌సెట్), జాకబ్ బెథెల్ (వార్విక్‌షైర్), హ్యారీ బ్రూక్ (యార్క్‌షైర్), బ్రైడన్ కార్స్ (డర్హామ్), సామ్ కుక్ (ఎస్సెక్స్), జాక్ క్రావ్లీ (కెంట్), బెన్ డకెట్ (నాటింగ్‌హామ్‌షైర్), జేమీ ఓవర్టన్ (సర్రే), ఒలీ పోప్ (సర్రే), జో రూట్ (యార్క్‌షైర్), జేమీ స్మిత్ (సర్రే), జోష్ టంగ్ (నాటింగ్‌హామ్‌షైర్), క్రిస్ వోక్స్ (వార్విక్‌షైర్).
ఇంగ్లాండ్ టెస్ట్ పర్యటనకు బీసీసీఐ 18 మందితో కూడిన భారత జట్టును ఇప్పటికే ప్రకటించింది. టీమ్ కు కొత్త కెప్టెన్ శుభ్ మన్ గిల్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్ తర్వాత టీమిండియా ఆడనున్న ఫస్ట్ టెస్టు సిరీస్ ఇదే. రవీంద్ర జడేజా లేకుండా భారతదేశం ఆడే తొలి టెస్ట్ సిరీస్ కూడా.
ఎనిమిది సంవత్సరాలకు పైగా గ్యాప్ తర్వాత కరుణ్ నాయర్ భారత టెస్ట్ జట్టుకు తిరిగి వచ్చాడు. గత వారం ఇండియా ఎ తరపున ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు నాయర్. ఆ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు.