టీమిండియాతో జరగబోయే తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే.. పటిష్టంగా ఇంగ్లిష్ టీమ్ బ్యాటింగ్ లైనప్-england announced playing xi for first test against india chris woaks returns ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  టీమిండియాతో జరగబోయే తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే.. పటిష్టంగా ఇంగ్లిష్ టీమ్ బ్యాటింగ్ లైనప్

టీమిండియాతో జరగబోయే తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే.. పటిష్టంగా ఇంగ్లిష్ టీమ్ బ్యాటింగ్ లైనప్

Hari Prasad S HT Telugu

టీమిండియాతో శుక్రవారం (జూన్ 20) నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును అనౌన్స్ చేసింది. హెడింగ్లీలో ఈ మ్యాచ్ జరగనుంది. ఆ టీమ్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉన్నా.. బౌలింగే బలహీనంగా కనిపిస్తోంది.

టీమిండియాతో జరగబోయే తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే.. పటిష్టంగా ఇంగ్లిష్ టీమ్ బ్యాటింగ్ లైనప్ (Action Images via Reuters)

హెడింగ్లీలో భారత్‌తో జరిగే తొలి టెస్టుకు ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ లెవెన్ ను ఖరారు చేసింది. వైస్ కెప్టెన్ ఓలీ పోప్ 3వ స్థానాన్ని నిలబెట్టుకోగా, జాకబ్ బెథెల్ కు చోటు దక్కలేదు. శుభమాన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుతో ఐదు టెస్టుల సిరీస్‌తో తమ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వేట ప్రారంభించడానికి ఇంగ్లండ్ సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఇండియా సిరీస్ తర్వాత నవంబర్ లో ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ కూడా ఉంది.

ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ ఇలా..

ఇంగ్లండ్ ఎంపిక చేసిన తుది జట్టు చూస్తే వాళ్లు బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. పెద్ద టీమ్స్ పై పెద్దగా రాణించని ఓలీ పోప్ కు అవకాశం ఇవ్వడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇండియన్ టీమ్ పై అతడు పెద్దగా రాణించలేదు. స్వదేశంలో భారత్‌పై ఆడిన నాలుగు మ్యాచ్‌లలో అతను 21 సగటుతో 147 పరుగులు చేశాడు.

అయితే 21 ఏళ్ల బెథెల్ ను మాత్రం తప్పించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అతడు న్యూజిలాండ్ పై మూడు హాఫ్ సెంచరీలు, వెస్టిండీస్ తో వన్డే సిరీస్ లో 82 రన్స్ చేశాడు. కానీ అతనికి రెడ్ బాల్ క్రికెట్ అనుభవం ఎక్కువగా లేకపోవడంతో తుది జట్టులోకి తీసుకోలేదు. బ్యాటింగ్ లైనప్ చూస్తే.. క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్ తో పటిష్టంగా కనిపిస్తోంది.

ఇంగ్లండ్ బౌలింగ్ ఇలా..

బౌలింగ్ విభాగం విషయానికి వస్తే.. చీలమండ గాయం నుండి కోలుకున్న తర్వాత క్రిస్ వోక్స్ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. అతనితో పాటు బ్రిడాన్ కార్స్ కూడా ఉన్నాడు. అతను తన మొదటి స్వదేశీ టెస్ట్ ఆడనున్నాడు. హామ్‌స్ట్రింగ్ సమస్య కారణంగా గస్ అట్కిన్సన్ ను పక్కన పెట్టారు. కార్స్ కొత్త బంతితో వోక్స్‌ కు సహకరించే అవకాశం ఉంది.

జోష్ టంగ్, షోయబ్ బషీర్ ఇతర బౌలర్లుగా ఉన్నారు. జేమీ స్మిత్ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు. అయితే బ్యాటింగ్ తో పోలిస్తే ఇంగ్లండ్ బౌలింగ్ బలహీనంగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా రోహిత్, కోహ్లి రిటైర్మెంట్ నేపథ్యంలో అంతగా అనుభవం లేని టీమిండియా బ్యాటింగ్ లైనప్ కు ఇది కాస్త కలిసి వచ్చేదే. అటు టీమిండియా ఇంకా తుది జట్టు అనౌన్స్ చేయలేదు.

తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు

జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రిడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం