Virat Kohli : ఇన్‌స్టా పోస్టుకు కోహ్లీ 11 కోట్లు తీసుకుంటున్నాడా? అతడు ఏం చెబుతున్నాడు?
Virat Kohli Earnings : ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారుల జాబితాలో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 3వ స్థానంలో ఉన్నాడని ఓ వార్త వైరల్ అవుతోంది. దీనిపై కోహ్లీ స్పందించాడు.
విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఫామ్‌లో ఉన్నా, లేకపోయినా విరాట్ కోహ్లీ గురించి చర్చలు కచ్చితంగా జరుగుతాయి. క్రికెట్‌లో ఏ రికార్డులు ఉన్నా.. ఏ రికార్డులు బద్దలు కొట్టినా విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీనే. విరాట్ ఆడితేనే మ్యాచ్ చూసే జనాలు చాలా మంది ఉన్నారు. కోహ్లీ లేకుంటే.. మ్యాచ్ చూడకుండా ఉండేవాళ్లు చాలా మంది. చాలా దేశాల్లో అతడిని అభిమానించేవారు ఉన్నారు. క్రికెటర్ల కుటుంబ సభ్యులు కూడా కోహ్లీకి ఫ్యాన్స్. అతడికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఒక్క పోస్ట్ చేస్తే.. చాలు కోట్లలో రూపాయలు వచ్చేస్తాయి. అయితే ఇది ఎంతవరకు అనేది మాత్రం బయటకు తెలియదు.
ట్రెండింగ్ వార్తలు
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్‌గానే కాకుండా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న వ్యక్తిగా విరాట్ కోహ్లీ నిలిచాడని ఓ వార్త వైరల్ అవుతుంది. అథ్లెట్ల విషయానికొస్తే, స్టార్ ఫుట్‌బాల్ ఆటగాళ్లు లియోనెల్ మెస్సీ, రొనాల్డో ఇన్ స్టా ద్వారా అధికంగా సంపాదించే వ్యక్తుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై కోహ్లీ స్పందించాడు. ఆ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు.
విరాట్ కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీని 256 మిలియన్లకు పైగా ప్రజలు అనుసరిస్తున్నారు. దీని ద్వారా విరాట్ కోహ్లీ అనూహ్యమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ప్రతి పోస్ట్‌కు రూ.11.45 కోట్లు సంపాదిస్తున్నాడని వార్తలు వచ్చాయి. 2022లో విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు రూ. 3.25 కోట్ల వరకు మాత్రమే సంపాదించాడు. ఇప్పుడు పెరిగిందని అంటున్నారు. కానీ మరీ 11 కోట్ల రూపాయలు తీసుకోవడం లేదనేది కోహ్లీ మాట. అంతకంటే కాస్త తక్కువగా తీసుకుంటూ ఉండొచ్చు.
ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ల మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కలిగి ఉన్న రొనాల్డో ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు రూ.26.7 కోట్లు సంపాదిస్తున్నాడు. అదేవిధంగా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు రూ.21.5 కోట్లు సంపాదిస్తున్నాడు. భారతదేశంలో విరాట్ కోహ్లీ అత్యధికంగా సంపాదిస్తున్నాడు. కోహ్లీ తర్వాత ఇన్ స్టా పోస్టు ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న వ్యక్తిగా నటి ప్రియాంక చోప్రా ఉంది. ఆమె రూ.4.4 కోట్లు ఛార్జ్ చేస్తుంది. కోహ్లీ మాత్రం.. తాను 11.45 కోట్లు తీసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చాడు. కానీ ఒక్క పోస్ట్ చేస్తే.. కోట్లలో మాత్రం డబ్బులు తీసుకుంటాడు.