Ravichandran Ashwin: ‘అభిమానులూ.. అలా చేయొద్దు: అశ్విన్ సూచన
Ravichandran Ashwin: ఆసియా కప్ టోర్నీ కోసం ప్రకటించిన భారత జట్టుపై కొందరు అభిమానులు, మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆటగాళ్లను పక్కనపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించారు.
Ravichandran Ashwin: ఆసియా కప్ కోసం భారత జట్టును బీసీసీఐ కలెక్షన్ కమిటీ ఇటీవల ప్రకటించింది. ఆగస్టు 30 నుంచి జరగనున్న ఈ టోర్నీకి 17 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. అయితే, ఈ జట్టులో యజువేంద్ర చాహల్, సంజూ శాంసన్, రవిచంద్రన్ అశ్విన్ పేర్లు లేకపోవడంపై కొందరు అభిమానులు, మాజీలు విమర్శలు చేస్తున్నారు. శాంసన్ కేవలం రిజర్వ్ ప్లేయర్‌గా అవకాశం దక్కించుకోగా.. అతడిని ప్రధాన జట్టులో ఎందుకు తీసుకోలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ కేఎల్ రాహుల్ సిద్ధంగా లేకపోతే అప్పుడు సంజూకు ఆసియా కప్‍లో ఆడే ఛాన్స్ వస్తుంది. దీంతో చాహల్, శాంసన్‍కు అన్యాయం చేశారని సోషల్ మీడియాలో చాలా మంది విమర్శిస్తున్నారు. ఆసియాకప్‍లో చోటు దక్కించుకున్న కొందరు ఆటగాళ్ల గణాంకాలతో.. శాంసన్, చాహల్‍ను పోలుస్తున్నారు. ఈ తరుణంలో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించారు. అభిమానులకు సూచనలు చేశారు.
ట్రెండింగ్ వార్తలు
వన్డేల్లో సూర్య కుమార్ యాదవ్ సగటు 24గా ఉందని.. అతడి కంటే సగటు చాలా మెరుగ్గా ఉన్న సంజూ శాంసన్ (55)ను పక్కన పెట్టడమేంటని సోషల్ మీడియా వేదికగా శాంసన్ అభిమానులు సెలెక్టర్లను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు వన్డేలు ఆడని తిలక్‍ను తీసుకొని సంజూను ఎందుకు రిజర్వ్ ప్లేయర్‌గా పరిమితం చేశారని అంటున్నారు. ఈ వాదనలపై అశ్విన్ స్పందించారు. “మీ ఫేవరెట్ క్రికెటర్ ఎంపిక కాలేదని, ఎంపికైన ఇతర ఆటగాళ్లను తక్కువ చేసి మాట్లాడొద్దు. కించపరచొద్దు” అని అభిమానులు, విమర్శకులకు అశ్విన్ సూచించారు.
ఆసియా కప్ టోర్నీ కోసం టీమిండియాలో సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్ము తీసుకోవడాన్ని అశ్విన్ సమర్థించారు. ఈ విషయంపై తన యూట్యూబ్ ఛానెల్‍లో మాట్లాడాడు. “వారేం చేస్తున్నారో సెలెక్టర్లకు తెలుసు. ఇండియా లాంటి పెద్ద దేశంలో జట్టును ఎంపిక చేస్తున్నప్పుడు కొందరు కీలక ఆటగాళ్లకు చోటు లభించకపోవచ్చు. మీ ఫేవరెట్ ప్లేయర్ జట్టులో లేరని, ఇతరులను మీరు తక్కువ చూసి చూడకూడదు” అని అశ్విన్ అన్నారు.
ఐర్లాండ్‍తో టీ20ల్లో తిలక్ వర్మ విఫలమైనా.. మొదటి బంతి నుంచే అతడి ఆలోచన తీరు చాలా పాజిటివ్‍గా అనిపించిందని అశ్విన్ చెప్పారు. దూకుడుగా ఆడాలనే క్లియర్ మైండ్‍సెట్‍లో తిలక్ వచ్చాడని, అలాంటి వారికి సెలెక్టర్లు మద్దతునివ్వడం కరెక్టేనని అన్నారు. సూర్యకు కూడా ఇదే వర్తిస్తుందని అశ్విన్ అభిప్రాయపడ్డారు.
ఐపీఎల్ వార్‌ఫేర్ ఇప్పుడు సరికాదని రవిచంద్రన్ అశ్విన్ అభిమానులు సూచించారు. టీమిండియాకు ఆడుతున్నప్పుడు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిగానే అందరినీ చూడాలని సూచించారు. ఐపీఎల్‍లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు కాబట్టే సూర్యకుమార్ యాదవ్‍కు ఆసియా కప్‍లో చోటు దక్కిందనడం సరైనది కాదని అశ్విన్ చెప్పారు.
సంబంధిత కథనం
టాపిక్