Disha Patani Hot Dance: దిక్కుమాలిన డ్రెస్.. పిల్లలు చూస్తారని తెలీదా.. దిశా పటాని హాట్ డ్యాన్స్ పై ట్రోల్స్
Disha Patani Hot Dance: ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ గ్లామర్ బాంబ్ దిశా పటాని హాట్ పర్ ఫార్మెన్స్ పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. పిల్లలు కూడా చూసే ఈ ఈవెంట్ లో ఇలాంటి ఎక్స్ పోజింగ్ డ్యాన్స్ ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ గ్లామర్ క్వీన్ దిశా పటాని డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ హాట్ టాపిక్ గా మారింది. లిమిట్ కు మించిన హాట్ నెన్ తో ఆమె డ్యాన్స్ చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పిల్లలు కూడా చూసే ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో ఇలాంటి పొట్టి బట్టలతో ఎక్స్ పోజ్ చేసేలా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఐపీఎల్, బీసీసీఐపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మరోవైపు ఇంకొంతమంది ఏమో హాట్ డ్యాన్స్ తో దిశా పిచ్చెక్కించిందని కామెంట్లు చేస్తున్నారు.
ఐపీఎల్ 18
ఐపీఎల్ ఇక పిల్లలకు ఏ మాత్రం కాదని.. 18వ ఏట అడుగుపెట్టేసరికి పెద్దలకు మాత్రమే అన్నట్లు లీగ్ మారిపోయిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్ 18+ అంటూ ట్రోల్ చేస్తున్నారు. దిశా పటానికి ఇది తప్పా ఇంకేమీ తెలియదని మండిపడుతున్నారు. ఇలాంటి ఔట్ ఫిట్స్ ను ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో అనుమతించొద్దని కోరుతున్నారు. అండర్-18 పిల్లలు కూడా చూస్తారని, ఇది తప్పుడు ఉదాహరణగా మారుతుందని అంటున్నారు. డీసెన్సీ మెయింటేన్ చేయాలని చెబుతున్నారు.
మధ్యలో కట్
ఐపీఎల్ 2025 ఓపెనింగ్ వేడుకలను జియోహాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చారు. శ్రేయా ఘోషల్ మ్యూజికల్ ట్రీట్ తర్వాత దిశా పటాని స్టేజీపైకి వచ్చింది. వస్తూనే అందచందాలను ప్రదర్శిస్తూ డ్యాన్స్ చేయడం మొదలెట్టింది. కానీ ఆ డ్యాన్స్ ను మధ్యలోనే జియోహాట్ స్టార్ లైవ్ చూపించడం ఆపేసింది. అప్పుడు ప్రజెంటర్, కామెంటేటర్లు స్క్రీన్ పై కనిపించారు. కాసేపటికే దిశా పటాని డ్యాన్స్ ముగింపు చూపించారు. దీనిపై కూడా ఫ్యాన్స్ నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ఇంతటి హాట్ ఫర్ ఫార్మెన్స్ ను మధ్యలో ఎందుకు కట్ చేశారని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
సిజ్లింగ్ డ్యాన్స్
టూ పీస్ డ్రెస్ తో దిశా పటాని డ్యాన్స్ తో ఫైర్ పుట్టించిందని మరికొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. వాట్ ఏ సిజ్లింగ్ డ్యాన్స్ అంటూ వైరల్ చేస్తున్నారు. ఆమె డ్యాన్స్ వీడియోలు, ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. ఐపీఎల్ 18కు ఇది పర్ ఫెక్ట్ ఓపెనింగ్ అంటూ వ్యంగ్యంగా కూడా స్పందిస్తున్నారు. అంతే కాకుండా దిశా పటాని డ్యాన్స్ చూసి ఐసీసీ ఛైర్మన్ జై షా ఎక్సైటింగ్ గా స్పందించాడంటూ పోస్టులు పెడుతున్నారు.
మొత్తానికి ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీ మాత్రం దిశా పటాని హాట్ డ్యాన్స్ కారణంగా వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. మరోవైపు దిశా పటాని కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడూ బోల్డ్ ఫొటోలు పోస్టు చేస్తూనే ఉంటోంది. హాట్ ఫొటోలతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.
సంబంధిత కథనం