Dhoni Hair Style: ధోనీ లుక్ అదిరిపోయింది.. కొత్త హెయిర్ స్టైల్ చూశారా? వయసు తగ్గుతోందా?-dhoni new hair style look going viral cricket news in telugu ,cricket న్యూస్
Telugu News  /  Cricket  /  Dhoni New Hair Style Look Going Viral Cricket News In Telugu

Dhoni Hair Style: ధోనీ లుక్ అదిరిపోయింది.. కొత్త హెయిర్ స్టైల్ చూశారా? వయసు తగ్గుతోందా?

Hari Prasad S HT Telugu
Oct 03, 2023 01:00 PM IST

Dhoni Hair Style: ధోనీ లుక్ అదిరిపోయింది.. అతడు తన కొత్త హెయిర్ స్టైల్ తో దిగిన ఫొటోలు చూసి రోజురోజుకీ ధోనీ వయసు తగ్గుతోందా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

కొత్త హెయిర్ స్టైల్ తో ధోనీ
కొత్త హెయిర్ స్టైల్ తో ధోనీ

Dhoni Hair Style: ధోనీ మళ్లీ లాంగ్ హెయిర్ తో మన ముందుకు వస్తున్నాడు. క్రికెట్ లోకి వచ్చిన కొత్తలో ఝులపాల జుట్టుతో టార్జాన్ లా కనిపించిన అతడు.. తర్వాత ట్రిమ్ హెయిర్ స్టైల్ తో చాలా కాలం కనిపించాడు. ఇక ఇప్పుడు మరోసారి ఓ సూపర్ హెయిర్ స్టైల్ తో ధోనీ ఫొటోలకు పోజులిచ్చాడు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ఈ ఫొటోల్లో ధోనీని చూసి అతని వయసు రోజు రోజుకూ తగ్గుతోందా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి మిస్టర్ కూల్ ఈ లుక్ లో చాలా కూల్ గా కనిపించాడు. అతని కొత్త హెయిర్ స్టైల్ చాలా స్టైలిష్ గా ఉంది. "ఎస్.. అది మన మహేంద్ర సింగ్ ధోనీయే" అనే క్యాప్షన్ తో ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

సోషల్ మీడియాలో ఈ ఫొటోలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. 42 ఏళ్ల వయసులో ధోనీ ఫిట్‌నెస్, లుక్స్ చూసి ఫ్యాన్స్ షాక్ తింటున్నారు. అచ్చూ ఓ యువ మోడల్ లాగా ధోనీ కనిపిస్తున్నాడు. ఈ సందర్భంగా హకీమ్ ఓ సుదీర్ఘ పోస్ట్ లో ధోనీతో పని చేసిన అనుభవాన్ని పంచుకున్నాడు.

"మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి పని చేయడం ప్రతి క్రియేటివ్ వ్యక్తికి ఓ గొప్ప అవకాశం. నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. గతంలో మేమిద్దరం కలిసి ఎన్నో విభిన్నమైన హెయిర్ స్టైల్స్ ట్రై చేశాం. అయితే ఈ మధ్య కాలంలో లాంగ్ హెయిర్ తో ఉన్న ఓ ఫొటోను ధోనీ నాకు చూపించి అలాంటి స్టైల్ కావాలని అడిగాడు. అందుకే అతని హెయిర్ కట్ చేయకుండా అలా పెంచుతూ వెళ్లాం" అని హకీమ్ రాసుకొచ్చాడు.

ఈ హెయిర్ స్టైల్ తో ధోనీ ఓ యాడ్ షూట్ చేయడం విశేషం. దానికి ముందు తాను ఈ ఫొటోలను తీసినట్లు హకీమ్ చెప్పాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైరై మూడేళ్లు దాటినా.. ధోనీకి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఐపీఎల్లో కొనసాగుతుండటంతో బ్రాండ్స్ అతని వెంట పడుతున్నాయి. వచ్చే ఏడాది కూడా అతడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడే అవకాశాలు ఉన్నాయి.

WhatsApp channel