Delhi Capitals Captain Axar: కేఎల్ రాహుల్ కాదు..ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా స్పిన్ ఆల్ రౌండర్.. ఫస్ట్ టైం పగ్గాలు
Delhi Capitals Captain Axar: ఐపీఎల్ 2025 కు ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్ ను అనౌన్స్ చేసింది. అనుభవం ఉన్న కేఎల్ రాహుల్ ను కాదని స్పిన్ ఆల్ రౌండర్ కు పగ్గాలు అప్పజెప్పింది. ఫస్ట్ టైం కెప్టెన్సీ అందుకున్న ఆ ఆటగాడు ఎవరంటే?

ఐపీఎల్ 2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ ను ఆనౌన్స్ చేసింది. ఉత్కంఠకు తెరదించింది. సస్పెన్స్ కు ఎండ్ కార్డు వేస్తూ శుక్రవారం (మార్చి 14) తమ కొత్త నాయకుణ్ని ప్రకటించింది. స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. రాబోయే ఐపీఎల్ సీజన్ లో జట్టు పగ్గాలను అక్షర్ చేతికిచ్చింది. కేఎల్ రాహుల్ అనూహ్యంగా కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకొన్నాడు.
ఫస్ట్ టైం
ఐపీఎల్ 2025 లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. ఢిల్లీ ఫ్రాంఛైజీ ఈ అనౌన్స్ మెంట్ చేసింది. ఓ మేజర్ జట్టుకు అక్షర్ కెప్టెన్ గా ఎంపికవడం ఇదే ఫస్ట్ టైం. ఈ ఏడాది జనవరిలో టీమిండియా టీ20 జట్టుకు అక్షర్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. డొమెస్టిక్ క్రికెట్లో తన టీం గుజరాత్ కు వేర్వేరు ఫార్మాట్లలో కలిపి 23 మ్యాచ్ ల్లో కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. రీసెంట్ గా సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీలో జట్టును నడిపించాడు.
ఓ మ్యాచ్ లో
2019 నుంచి ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు అక్షర్ పటేల్ ఆడుతున్నాడు. ఆ టీమ్ కు వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. 2025 సీజన్ కు ముందు ఆ టీం రిటైన్ చేసుకున్న టాప్ ఆటగాడు అక్షర్. అతనికి ఫ్రాంఛైజీ రూ.16.50 కోట్లు చెల్లించింది.
2024 సీజన్ లో అక్షర్ ఓ మ్యాచ్ లో ఢిల్లీకి కెప్టెన్ గా వ్యవహరించాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా పంత్ పై ఓ మ్యాచ్ బ్యాన్ విధించడంతో.. డూ ఆర్ డై మ్యాచ్ లో అక్షర్ కెప్టెన్ గా పగ్గాలు చేపట్టాడు. కానీ ఆ మ్యాచ్ లో ఆర్సీబీ చేతిలో ఓడిన ఢిల్లీ ప్లేఆఫ్స్ కు దూరమైంది.
రాహుల్ కు నో ఛాన్స్
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఉన్న పంత్ ఆ టీమ్ ను వదిలి వెళ్లిపోయాడు. ఢిల్లీ అతణ్ని రిటైన్ చేసుకోకపోవడంతో కొత్త కెప్టెన్ అవసరం వచ్చింది. గత మూడు సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్ కు కెప్టెన్ గా పని చేసిన కేఎల్ రాహుల్ ను వేలంలో ఢిల్లీ తీసుకుంది. దీంతో అతనికే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించేలా కనిపించింది. మరోవైపు మాజీ కెప్టెన్ డుప్లెసిస్ కూడా ఉన్నాడు.
కానీ రాహుల్ భార్య అతియా ప్రెగ్నెంట్. ఆమె డెలివరీ కోసం ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్ లకు రాహుల్ దూరమయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కు అక్షర్ నమ్మదగ్గ ఆటగాడిగా ఉన్నాడు. అందుకే అక్షర్ వైపే ఫ్రాంఛైజీ మొగ్గు చూపింది. ఆరు సీజన్లలో ఆ టీమ్ తరపున 82 మ్యాచ్ లాడిన అక్షర్ ఆ జట్టు సీనియర్ ప్లేయర్. గత సీజన్ లో అక్షర్ 235 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు పడగొట్టాడు.
అక్షర్ గ్రేట్ ఫుల్
‘‘ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అవడం నాకు దక్కిన గొప్ప గౌరవం. మా ఓనర్స్, సపోర్ట్ స్టాఫ్ కు రుణపడి ఉంటా. నాపై నమ్మకముంచారు. క్యాపిటల్స్ తో ఆడుతూ వ్యక్తిగా, క్రికెటర్ గా ఎదిగా. ఈ టీమ్ ను నడిపించేందుకు ఆత్మవిశ్వాసంతో రెడీగా ఉన్నా’’ అని అక్షర్ తెలిపాడు.
సంబంధిత కథనం