Kohli Diamond Bat : వరల్డ్ కప్‌కు ముందు కోహ్లీకి డైమండ్ బ్యాట్ గిఫ్ట్.. ధర తెలిస్తే షాక్-cricket news surat buisnessman plans to gift virat kohli a diamond bat ahead of world cup 2023 details inside ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kohli Diamond Bat : వరల్డ్ కప్‌కు ముందు కోహ్లీకి డైమండ్ బ్యాట్ గిఫ్ట్.. ధర తెలిస్తే షాక్

Kohli Diamond Bat : వరల్డ్ కప్‌కు ముందు కోహ్లీకి డైమండ్ బ్యాట్ గిఫ్ట్.. ధర తెలిస్తే షాక్

Anand Sai HT Telugu

Virat Kohli Diamond Bat : విరాట్ కోహ్లీకి ఉన్న అభిమానులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోహ్లీ అంటే ఏదైనా చేసే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఓ అభిమాని మాత్రం.. కోహ్లీకి డైమండ్ బ్యాట్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

విరాట్ కోహ్లీ (ICC)

ఆగస్టు 18న అంతర్జాతీయ క్రికెట్‌లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి సూరత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త బ్యాట్ బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇది మామూలు బ్యాట్ కాదు లక్షలాది రూపాయల విలువైన డైమండ్ బ్యాట్.

ఆగస్ట్ 18తో అంతర్జాతీయ క్రికెట్ ఆడి 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు కోహ్లీ. దీంతో అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. కోహ్లీ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు. ఓ వ్యాపారవేత్త మాత్రం.. బ్యాట్ బహుమతిగా ఇవ్వాలని అనుకున్నాడు. సూరత్‌కు చెందిన వ్యాపారవేత్త విరాట్ కోహ్లీకి డైమండ్ బ్యాట్‌(Virat Kohli Diamond Bat)ను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

కోహ్లీకి ఇవ్వనున్న ఈ బ్యాట్ 1.04 క్యారెట్ ఒరిజినల్ డైమండ్‌(Original Diamond)తో తయారు చేశారు. ఈ బ్యాట్ 15 మిల్లీమీటర్ల పొడవు మరియు 5 మిల్లీమీటర్ల వెడల్పుతో ఉంటుంది. దీని ధర రూ.10 లక్షలుగా చెబుతున్నారు. డైమండ్ టెక్నాలజీ నిపుణుడు, లెక్సస్ సాఫ్ట్‌మాక్ కంపెనీ డైరెక్టర్ ఉత్పల్ మిస్త్రీ ఈ బ్యాట్ తయారీ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.

కోహ్లీకి బ్యాట్‌(Kohli Bat)ను బహుమతిగా ఇవ్వాలని భావించిన సూరత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త సహజ వజ్రంతో తయారు చేసిన బ్యాట్‌ను కావాలని అడిగినట్టుగా ఉత్పల్ వెల్లడించాడు. ఇందుకు సంబంధించి కఠిన ఆదేశాలు కూడా ఇచ్చామని తెలిపాడు. కోహ్లీకి బహుమతి ఇవ్వాలనుకున్న వ్యాపారవేత్త, కోహ్లీకి వీర అభిమాని. చాలా ఏళ్లుగా కోహ్లీని ఫాలో అవుతున్నాడు.

విరాట్ కోహ్లీ(virat kohli) ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. వెస్టిండీస్ పర్యటన తర్వాత ఆగస్ట్ 30 నుండి ప్రారంభమయ్యే ఆసియా కప్‌(Asia Cup)లో కనిపించనున్నాడు. వన్డే ప్రపంచకప్(ODI World Cup) కోసం టీమిండియా సన్నద్ధతను పరీక్షించనున్న ఈ టోర్నీ కోహ్లీకి, టీమ్ ఇండియా(Team India)కు చాలా ముఖ్యమైనది. ఈ ఏడాది ఆసియాకప్‌లో భారత్‌ తన తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో(IND Vs PAK) ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 2న జరగనుంది. ఇక ప్రపంచ కప్ భారతదేశంలో ప్రారంభమవుతుంది. ఇక్కడ భారతదేశం, పాకిస్థాన్ అక్టోబర్ 14న తలపడతాయి.