IND vs WI 5th T20: నిర్ణయాత్మక మ్యాచ్‍లో టీమిండియాదే టాస్.. అదే జట్టుతో..
IND vs WI 5th T20: టీమిండియా, వెస్టిండీస్ మధ్య సిరీస్ నిర్ణయాత్మక ఐదో టీ20 మొదలైంది. ఈ మ్యాచ్‍లో గెలిచిన జట్టే సిరీస్ కైవసం చేసుకుంటుంది.
IND vs WI 5th T20: టీమిండియా, వెస్టిండీస్ మధ్య నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్ మొదలైంది. ఐదు టీ20ల సిరీస్‍లో ప్రస్తుతం ఇరు జట్లు 2-2తో ఉండగా.. ఈ మ్యాచ్ గెలిచిన జట్టుకే సిరీస్ దక్కనుంది. అమెరికాలోని లౌడర్‌హిల్‍లో నేడు (ఆగస్టు 13) జరుగుతున్న ఈ సిరీస్ డిసైడర్ ఐదో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందు బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు. నాలుగో మ్యాచ్ ఆడిన జట్టుతోనే టీమిండియా ఈ మ్యాచ్ బరిలోకి దిగింది. తుది జట్టులో మార్పులు చేయలేదు. మరోవైపు, వెస్టిండీస్ రెండు చేంజెస్ చేసింది. మరో స్పిన్నర్ చేజ్‍ను ఈ కీలకమైన మ్యాచ్ కోసం తుది జట్టులోకి తీసుకుంది.
ట్రెండింగ్ వార్తలు
తమను తాము చాలెంజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నామని, అందుకే ముందుగా బ్యాటింగ్ తీసుకున్నట్టు భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పాడు. “మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. మమ్మల్ని మేం చాలెంజ్ చేసుకోవాలని నేను ఎప్పుడు ఫీల్ అవుతా. ఇది మంచి పిచ్. గతేడాది కంటే ఇప్పుడు బాగుంది” అని టాస్ సమయంలో హార్దిక్ అన్నాడు. నాలుగో మ్యాచ్ ఆడిన జట్టుతోనే వస్తున్నామని, తుదిజట్టులో మార్పులు చేయలేదని పేర్కొన్నాడు.
ఇక, వెస్టిండీస్ స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్ తుది జట్టులోకి వచ్చాడు. అలాగే స్పిన్నర్ రోస్టన్ చేజ్‍ను కూడా తీసుకుంది విండీస్. “ముందు బౌలింగ్ చేయడం సంతోషమే. మేం కాస్త తడబడుతున్నాం. ఇది మంచి పిచ్. అయితే, బ్యాటర్‌ను బట్టి డిఫరెంట్‍గా ప్లాన్ చేయాలి. మేం మా బెస్ట్ కాంబినేషన్‍తో వచ్చాం” అని విండీస్ కెప్టెన్ షాయో హోప్ చెప్పాడు. ఈ పర్యటనలో టీమిండియాకు ఇదే తుది మ్యాచ్‍గా ఉంది. తదుపరి ఐర్లాండ్ వేదికగా ఇండియా, ఐర్లాండ్ మధ్య టీ20 సిరీస్ ఆగస్టు 18న మొదలవుతుంది.
భారత తుదిజట్టు: శుభ్‍మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, యజువేంద్ర చాహల్, ముకేశ్ కుమార్
వెస్టిండీస్ తుదిజట్టు: కైల్ మేయర్స్, బ్రెండెన్ కింగ్, షాయ్ హోప్, పూరన్, రావ్మన్ పోవెల్ (కెప్టెన్), షిమ్రాన్ హిట్మైర్, జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్, రొస్టన్ చేజ్, అకీల్ హొసీన్, అల్జారీ జోసెఫ్
టాపిక్