IND Vs WI 4th T20 : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ నాలుగో టీ20.. భారత్‌కు కీలకం
IND Vs WI 4th T20 : టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ ఆగస్టు 12న తలపడనున్నాయి. ఐదు మ్యాచ్ లో టీ20 సిరీస్ లో మూడు మ్యాచ్ లు జరిగాయి. ఇందులో ఒకదాంట్లోనే ఇండియా గెలిచింది. తదుపరి మ్యాచ్ చాలా కీలకం
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్, వెస్టిండీస్ మరోసారి తలపడనున్నాయి. తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుస పరాజయాలను చవిచూసిన భారత జట్టు మూడో మ్యాచ్‌లో పుంజుకుని అద్భుత విజయాన్ని అందుకుంది. ఆ వరుస విజయాల పరంపరను కొనసాగించాలనే కాన్ఫిడెంట్‌తో టీమిండియా 4వ మ్యాచ్‌కు సిద్ధమైంది.
ఈ సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడాలోని మియామీలో జరగనున్నాయి. హార్దిక్ పాండ్యా జట్టుకు ఈ రోజు చాలా కీలకం. సిరీస్‌లో పరాజయం నుంచి ఎలా బయటపడుతుందనేది ఆసక్తికరంగా మారింది. సమిష్టి ప్రదర్శన కోసం టీమ్ ఇండియా అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఈ సిరీస్‌లోని నాలుగో గేమ్ సెంట్రల్ ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ రాత్రి 7:30 గంటలకు వేస్తారు. ఈ మ్యాచ్‌ను డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఫ్యాన్ కోడ్, జియో సినిమాలో కూడా చూడవచ్చు. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది.
మెుదట బ్యాటింగ్ చేసిన జట్టుకు కలిసి వచ్చే అవకాశం ఉంది. తొలుత బ్యాటింగ్ చేసే జట్టు 200 పరుగులు చేసే ఛాన్స్ ఎక్కువగానే ఉంది. కాబట్టి ఇక్కడ టాస్ కీలకం కానుంది. భారత జట్టులో ఏదైనా మార్పులు చేస్తారో.. లేదంటే మూడో టీ20 జట్టునే కంటిన్యూ చేస్తారో చూడాలి.
వెస్టిండీస్ జట్టు : బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రొమారియో షెపర్డ్, రోస్టన్ చేజ్, అకెల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్, ఒషానే థామస్, ఒడియన్ షాయ్ హోప్, జాసన్ హోల్డర్