Yuzvendra Chahal: ఆసియా కప్ టీమ్‌లో తనకు చోటు దక్కకపోవడంపై చహల్ ఎలా రియాక్టయ్యాడో చూడండి-cricket news in telugu yuzvendra chahal cryptic tweet on asia cup snub ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Yuzvendra Chahal: ఆసియా కప్ టీమ్‌లో తనకు చోటు దక్కకపోవడంపై చహల్ ఎలా రియాక్టయ్యాడో చూడండి

Yuzvendra Chahal: ఆసియా కప్ టీమ్‌లో తనకు చోటు దక్కకపోవడంపై చహల్ ఎలా రియాక్టయ్యాడో చూడండి

Hari Prasad S HT Telugu

Yuzvendra Chahal: ఆసియా కప్ టీమ్‌లో తనకు చోటు దక్కకపోవడంపై చహల్ రియాక్టయ్యాడు. సింపుల్ గా రెండు ఎమోజీలతో చహల్ రియాక్ట్ అయిన తీరు ఇప్పుడు వైరల్ అవుతోంది.

యుజువేంద్ర చహల్ (AFP)

Yuzvendra Chahal: టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ ఆసియా కప్ టీమ్ లో చోటు దక్కకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. జడేజా, కుల్దీప్, అక్షర్ పటేల్ లకు అవకాశం ఇచ్చిన సెలక్టర్లు.. చహల్ ను పక్కన పెట్టారు. దీనిపై చహల్ కేవలం రెండే రెండు ఎమోజీలతో రియాక్ట్ అవడం ఇప్పుడు వైరల్ గా మారింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గతంలో ట్విటర్)లో చహల్ ఈ రెండు ఎమోజీల ద్వారా తన ఫీలింగ్స్ ను చెప్పే ప్రయత్నం చేశాడు. మొదటి ఎమోజీలో మబ్బుల చాటు సూర్యుడు ఉండగా.. ఆ తర్వాత మబ్బులు తొలగిపోయి ప్రకాశవంతంగా కనిపిస్తున్న సూర్యుడి ఎమోజీలను చహల్ పోస్ట్ చేశాడు. వీటి ద్వారా ప్రస్తుతం తాను మబ్బుల చాటు సూర్యుడిగా ఉన్నా.. భవిష్యత్తులో ప్రకాశవంతంగా మెరుస్తానని అతడు చెప్పకనే చెప్పాడు.

2019 వరల్డ్ కప్ తర్వాత ఇండియా తరఫున వన్డేల్లోనూ చహల్ నిలకడగా రాణిస్తున్నాడు. ఆ వరల్డ్ కప్ తర్వాత ఈ నాలుగేళ్లలో 23 వన్డేలు ఆడి 37 వికెట్లు తీశాడు. అయితే ఈ మధ్య కాలంలో కుల్దీప్ యాదవ్ తిరిగి ఫామ్ లోకి రావడంతో చహల్ క్రమంగా మరుగునపడిపోతున్నాడు. తాజాగా ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన 17 మంది జట్టులోనూ కుల్దీప్ కే అవకాశం దక్కింది.

అయితే ప్రస్తుతం ఉన్న జట్టులో ముగ్గురూ లెఫ్టామ్ స్పిన్నర్లే కావడం విశేషం. జడేజా, అక్షర్ పటేల్ లెఫ్టామ్ ఫింగర్ స్పిన్నర్స్ కాగా.. కుల్డీప్ లెఫ్టామ్ రిస్ట్ స్పిన్నర్. పైగా జడేజా, అక్షర్ బ్యాట్ తోనూ రాణించగలరు. దీంతో సెలక్టర్లు వాళ్లవైపు మొగ్గు చూపారు. నిజానికి ఇద్దరు లెగ్ స్పిన్నర్లకు అవకాశం కల్పించడం కష్టమని చహల్ ను తొలగించడంపై చీఫ్ సెలక్టర్ అగార్కర్ వివరణ ఇచ్చాడు.

అటు రోహిత్ కూడా ఇదే మాట చెప్పాడు. "ఆ స్థానంలో బ్యాటింగ్ చేసే ప్లేయర్ అవసరం. అక్షర్ బాగా ఆడుతున్నాడు. వైట్ క్రికెట్ లో ఈ ఏడాది అతడు బాగా బ్యాటింగ్ చేశాడు. అంతమాత్రాన ఏ ప్లేయర్ కూ తలుపులు మూసుకుపోలేదు. ఎవరైనా ఏ సమయంలో అయినా రావచ్చు. చహల్ చాలా వైట్ బాల్ క్రికెట్ ఆడాడు. వరల్డ్ కప్ కు అతడు అవసరం అనిపిస్తే కచ్చితంగా తీసుకుంటాం. అశ్విన్, సుందర్ లకూ ఇదే వర్తిస్తుంది. అందరికీ అవకాశం ఉంది" అని రోహిత్ స్పష్టం చేశాడు.

సంబంధిత కథనం