NZ vs PAK World Cup: ఫకర్ మెరుపు శకతం.. పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవం-cricket news fakhar zaman hits century pakistan beat new zealand in dls method stays alive in semis race ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Nz Vs Pak World Cup: ఫకర్ మెరుపు శకతం.. పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవం

NZ vs PAK World Cup: ఫకర్ మెరుపు శకతం.. పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవం

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 04, 2023 08:05 PM IST

NZ vs PAK World Cup 2023: న్యూజిలాండ్‍పై డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో పాకిస్థాన్ గెలిచింది. దీంతో వన్డే ప్రపంచకప్‍లో సెమీ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

ఫకర్ జమాన్
ఫకర్ జమాన్ (PTI)

NZ vs PAK World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో సెమీ ఫైనల్ ఆశలను పాకిస్థాన్ సజీవంగా నిలుపుకుంది. న్యూజిలాండ్‍తో కీలక మ్యాచ్‍లో పాక్ రాణించింది. కాగా, కివీస్ వరుసగా నాలుగో మ్యాచ్‍లో ఓడింది. ప్రపంచకప్‍లో బెంగళూరు వేదికగా నేడు (నవంబర్ 4) జరిగిన మ్యాచ్‍లో పాకిస్థాన్ డక్ వర్త్ లూయిస్ (DLS) పద్ధతిలో 21 పరుగుల తేడాతో న్యూజిలాండ్‍పై గెలిచింది. వర్షం ఆటంకం కలిగించిన మ్యాచ్‍లో చివరికి పాక్ విజయం సాధించింది. ఓ దశలో ఓవర్లను కుదించినా.. మళ్లీ వర్షం పడటంతో ఆట నిలిచింది. డీఎల్ఎస్ పద్ధతిలో పాక్ గెలిచింది.

yearly horoscope entry point

402 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 25.3 ఓవర్లలో ఒక వికెట్‍కు 200 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ (81 బంతుల్లో 126 పరుగులు నాటౌట్ ; 8 ఫోర్లు, 11 సిక్సర్లు) రెచ్చిపోయి అజేయ మెరుపు శతకం చేశాడు. సిక్సర్లతో కదం తొక్కాడు. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కెప్టెన్ బాబర్ ఆజమ్ (66 నాటౌట్) అర్ధ శకతం చేశాడు. సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆ సమయంలో భారీ వర్షం రావటంతో మ్యాచ్ నిలిచిపోయింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పాకిస్థాన్ 21 పరుగులు ముందుడటంతో ఆ జట్టు గెలిచినట్టు అంపైర్లు ప్రకటించారు.

అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 401 రన్స్ చేసింది. యువ స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (108) శతకంతో అదరగొట్టగా.. గాయం నుంచి కోలుకొని వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (95) సత్తాచాటాడు. పాక్ బౌలర్లలో మహమ్మద్ వాసిమ్ 3 వికెట్లు తీసుకున్నాడు. బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చేసినా ఫకర్ జమాన్ విధ్వంసకర శకతం, జోరు వర్షంతో పాక్ గెలిచేసింది. 401 పరుగుల భారీ స్కోరు చేసినా కివీస్ ఓటమి పాలైంది.

ఈ గెలుపుతో ప్రపంచకప్ టోర్నీలో పాకిస్థాన్ 8 పాయింట్లకు చేరుకుంది. ఎనిమిది మ్యాచ్‍ల్లో నాలుగు గెలిచినట్టయింది. దీంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరింది. ఇక, గ్రూప్ స్టేజీలో ఇంగ్లండ్‍తో జరిగే చివరి మ్యాచ్ కూడా గెలిస్తే పాక్‍కు సెమీస్ అవకాశాలు మరింత మెరుగుపడతాయి. కాగా, న్యూజిలాండ్ వరుసగా నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ టోర్నీలో తొలి నాలుగు మ్యాచ్‍లో గెలిచిన కివీస్.. వరుసగా నాలుగు ఓడిపోయింది. పాక్ కంటే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది న్యూజిలాండ్.

Whats_app_banner