Aakash Chopra: రోహిత్, ద్రవిడ్ ఈ 5 ప్రశ్నలకు జవాబివ్వగలరా..: ఆకాశ్ చోప్రా-cricket news aakash chopra poses some tough questions to rohit and dravid ,cricket న్యూస్
Telugu News  /  Cricket  /  Cricket News Aakash Chopra Poses Some Tough Questions To Rohit And Dravid

Aakash Chopra: రోహిత్, ద్రవిడ్ ఈ 5 ప్రశ్నలకు జవాబివ్వగలరా..: ఆకాశ్ చోప్రా

Hari Prasad S HT Telugu
Aug 29, 2023 06:48 PM IST

Aakash Chopra: రోహిత్, ద్రవిడ్ ఈ 5 ప్రశ్నలకు జవాబివ్వగలరా అని ప్రశ్నించాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. ఆసియా కప్ తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండబోడని ద్రవిడ్ చెప్పిన తర్వాత ఆకాశ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

ఆకాశ్ చోప్రా, రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ
ఆకాశ్ చోప్రా, రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ

Aakash Chopra: ఆసియా కప్ 2023 కోసం టీమిండియా 17 మంది సభ్యులతో టీమ్ ఎంపిక చేసింది. అందులో కేఎల్ రాహుల్ కు కూడా అవకాశం ఇచ్చింది. కానీ తీరా టోర్నీ కోసం బయలుదేరే ముందు రోజు రాహుల్ తొలి రెండు మ్యాచ్ లకు అందుబాటులో ఉండబోడని కోచ్ ద్రవిడ్ చెప్పడం షాక్ కు గురి చేసింది. మరి రాహుల్ లేకపోతే ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వగలరా అంటూ ఆకాశ్ చోప్రా టీమిండియా కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ లను ప్రశ్నించాడు.

ట్రెండింగ్ వార్తలు

రాహుల్ ఉండి ఉంటే ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడంతోపాటు వికెట్ కీపింగ్ చేసేవాడు. ఇప్పుడు అతడు లేకపోవడంతో ఇషాన్ ను జట్టులోకి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఓపెనింగ్ ఎవరు చేస్తారు? మూడో స్థానంలో ఎవరు? ఐదోస్థానంలో ఎవరు అన్న ప్రశ్నలు తలెత్తుతాయి. రాహుల్ తొలి రెండు మ్యాచ్ లలో ఆడటం లేదని ద్రవిడ్ చెప్పిన తర్వాత ఆకాశ్ చోప్రా సోషల్ మీడియా ఎక్స్ (గతంలో ట్విటర్) ద్వారా కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు.

"కేఎల్ రాహుల్ తొలి రెండు మ్యాచ్ లు ఆడటం లేదు. ఇది కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇషాన్ ఓపెన్ చేస్తాడా? ఒకవేళ చేస్తే శుభ్‌మన్ ఏ స్థానంలో ఆడతాడు? లేదంటే రోహిత్, గిల్, ఇషాన్.. వరుసగా 1, 2, 3 స్థానాల్లో తర్వాత కోహ్లి 4వ స్థానంలో ఆడతారా? లేదంటే రోహిత్, గిల్ ఓపెన్ చేసి, కోహ్లి 3వ స్థానంలో వచ్చి, ఇషాన్ 5వ స్థానంలో ఆడతాడా? లేదంటే గిల్ ను పక్కన పెట్టి తిలక్ లేదా సూర్యకుమార్ లలో ఒకరిని 5వ స్థానంలో ఆడిస్తారా?" అంటూ ఆకాశ్ వరుస ప్రశ్నలు సంధించాడు.

నిజానికి ఆసియా కప్ కోసం జట్టును ఎంపిక చేసినప్పుడే తొలి మ్యాచ్ కు రాహుల్ అందుబాటులో ఉండకపోవచ్చని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పాడు. అయినా ఆ సమయానికి పూర్తి కోలుకోవచ్చనీ అన్నాడు. కానీ ఇప్పుడు ద్రవిడ్ మాత్రం రాహుల్ తొలి రెండు మ్యాచ్ లు ఆడటం లేదని తేల్చేశాడు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాహుల్ కు బ్యాకప్ గా ఎంపిక చేసిన సంజూ శాంసన్ పరిస్థితి ఏంటని కూడా గతంలో ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు. "రాహుల్ అందుబాటులో లేకపోతే ఇషాన్ కిషన్ కీలకమవుతాడు. సంజూ శాంసన్ కూడా జట్టులోకి రావచ్చు. ఐదో స్థానంలో బ్యాటర్ కావాలి కాబట్టి దానిని బట్టి టీమ్ ఎంపిక చేస్తారు. కీపర్, మిడిలార్డర్ బ్యాటర్ అయిన శాంసన్ బ్యాకప్ గా ఉండాలి. ఆ స్థానంలో అతడు బాగా ఆడాడు" అని ఆకాశ్ తన యూట్యూబ్ ఛానెల్లో అన్నాడు.

రాహుల్ అందుబాటులో లేకపోవడంతో ఇండియన్ టీమ్ రోహిత్, గిల్ తో ఓపెనింగ్ చేయించి మూడు, నాలుగు స్థానాల్లో కోహ్లి, శ్రేయస్ అయ్యర్ లను ఆడించడం ఖాయంగా కనిపిస్తోంది. ఐదో స్థానంలోనే వికెట్ కీపర్ బ్యాటర్ రావాల్సి ఉంటుంది. ఆ లెక్కన ఇషాన్ తనకు అలవాటైన స్థానంలో కాకుండా ఐదో స్థానంలో ఆడాల్సిందే.

WhatsApp channel
వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లేటెస్ట్ అప్‌డేట్స్ చూడండి  Cricket News  అలాగే  Live Score  ఇంకా Telugu News  మరెన్నో క్రికెట్ న్యూస్ హిందుస్తాన్ టైమ్స్ లో చూడండి.