County Championship: ఒక్క వికెట్టూ పడలేదు.. 8 మంది బ్యాటర్లు ఆడారు.. స్కోరేమో 504/0.. అదెలా సాధ్యమంటే?
County Championship: కౌంటీ ఛాంపియన్‌షిప్ వార్మ్అప్ మ్యాచ్‌లో వార్విక్‌షైర్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్‌లతో 504 పరుగులు చేసింది.
ఏప్రిల్ 4న ప్రారంభమయ్యే కౌంటీ ఛాంపియన్‌షిప్ కొత్త సీజన్ కోసం ఇంగ్లాండ్, వేల్స్‌లోని జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఆ దేశవ్యాప్తంగా అనేక వార్మ్అప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. బెర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లోనూ గొప్ప వార్మప్ మ్యాచ్ జరిగింది. వార్విక్‌షైర్ జట్టు నార్తంప్టన్‌షైర్‌పై ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్‌లతో 504 పరుగులు చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన నార్తంప్టన్‌షైర్ 423/7 పరుగులు చేసింది. సైఫ్ జైబ్ 102 పరుగులతో అత్యధిక స్కోరు చేశాడు. ఈ టీమ్ కు ఆస్ట్రేలియా మాజీ కోచ్ డారెన్ లీమన్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.
బ్యాటింగ్ ప్రాక్టీస్
నార్తంప్టన్‌షైర్ తో మ్యాచ్ లో వార్విక్‌షైర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ గొప్పగా సాగింది. 8 మంది బ్యాటర్లు బ్యాటింగ్ చేశారు. కానీ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆ టీమ్ 504 పరుగులు చేసింది. ఆ జట్టు ఆరుగురు ఆటగాళ్లరు రిటైర్ చేయడమే అందుకు కారణం. ఇతర బ్యాటర్ల ప్రాక్టీస్ కోసం అప్పటికే ఆడిన ఆటగాళ్లు పెవిలియన్ వెళ్లిపోయారు. అందుకే ఒక్క వికెట్టూ కూడా కోల్పోకుండా ఆ టీమ్ భారీ స్కోరు సాధించింది.
6 బ్యాటర్లు రిటైర్
కౌంటీ ఛాంపియన్‌షిప్ ప్రారంభానికి ముందు వీలైనంత మంది ఆటగాళ్లను పరీక్షించాలని వార్విక్‌షైర్ భావించింది. అందుకే బ్యాటర్లను రిటైర్ చేసింది. ఓపెనింగ్ పెయిర్ నుంచి తర్వాత వచ్చిన బ్యాటర్లు అందరూ సత్తాచాటారు. ఓపెనింగ్ జంట రాబ్ యేట్స్, అలెక్స్ డేవిస్ అద్భుతమైన ప్రారంభాన్ని ఇచ్చారు. డేవిస్ 101 బంతుల్లో 116 పరుగులు చేశాడు. యేట్స్ 84 బంతుల్లో 72 పరుగులు చేశాడు.
ఇంగ్లండ్ క్రికెట్ జాతీయ జట్టులో చోటు కోసం పోటీ పడుతున్న సామ్ హైన్ 52 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఆల్‌రౌండర్ డాన్ మౌస్లీ 54 బంతుల్లో 57 పరుగులు చేశాడు. హమ్జా షేక్, ఎడ్ బార్నార్డ్ కూడా అద్భుతంగా ఆడారు. నార్తంప్టన్‌షైర్ స్కోరును వార్విక్‌షైర్ దాటింది.
500 దాటి
కై స్మిత్, డాన్ని బ్రిగ్స్ చివరి ఇద్దరు బ్యాట్స్‌మెన్. వీళ్లు టీమ్ ను 500 పరుగుల మార్కును దాటించారు. దీంతో ఒక్క వికెట్ కూడా పడలేదు. రెండు రోజుల వార్మ్అప్ మ్యాచ్ ముగిసింది. ఈ బ్యాట్స్‌మెన్ అందరూ ఈ మ్యాచ్ లో తమ ప్రతిభను చూపించారు.
వార్విక్‌షైర్ తమ కౌంటీ ఛాంపియన్‌షిప్‌ను సస్సెక్స్‌తో ప్రారంభిస్తుంది. గత సంవత్సరం 14 మ్యాచ్‌లలో 9 మ్యాచ్‌లు డ్రా చేసుకున్న తర్వాత ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కీవీస్ ఆటగాడు టామ్ లాథమ్ వార్విక్‌షైర్ జట్టులో చేరనున్నాడు. అతను అంతర్జాతీయ అనుభవాన్ని జట్టుకు అందిస్తాడు. ఆస్ట్రేలియా ఆటగాడు బ్యూ వెబ్‌స్టర్ కూడా ఆ తర్వాత చేరనున్నాడు.
సంబంధిత కథనం
టాపిక్