2020 ఐపీఎల్ కు సీఎస్కే మాజీ కెప్టెన్, లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని సిద్ధమవుతున్నాడు. చెపాక్ స్టేడియంలో సీఎస్కే ప్రాక్టీష్ లో ధోని భారీ షాట్లు ఆడుతున్నాడు. ఈ సారి కూడా లీగ్ లో మెరుపు షాట్లతో అలరించేందుకు ఈ మిస్టర్ కూల్ రెడీ అవుతున్నాడు. గత సీజన్ లో ధోని ధనాధన్ ఇన్నింగ్స్ లతో ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. రాబోయే సీజన్ లోనూ ధోని మరోసారి తనదైన ముద్ర వేసేందుకు సై అంటున్నాడు.
హెలికాప్టర్ షాట్.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది మహేంద్ర సింగ్ ధోనీనే. జూలపాల జుట్టుతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ధోని.. కెరీర్ స్టార్టింగ్ లో ఈ షాట్ ఎక్కువగా ఆడేవాడు. బ్యాక్ ఫుట్ పై బలంగా నిలబడి, పవర్ ఉపయోగించి బంతిని అమాంతం స్టాండ్స్ లో పడేసేవాడు.
షాట్ కొట్టే క్రమంలో చేతుల్లో బ్యాట్ గిర్రుమని తిరిగేది. ధోని కొట్టే ఈ షాట్ కు హెలికాప్టర్ షాట్ అనే పేరు వచ్చింది. ఇతర క్రికెటర్లు కూడా అప్పుడప్పుడూ ఈ షాట్ ఆడిన ధోని ఆడితే వచ్చే మజా కనిపించేది కాదు.
ఐపీఎల్ 2025 కోసం సిద్ధమవుతున్న ధోని మరోసారి తన సిగ్నేచర్ షాట్ హెలికాప్టర్ ను బయట పెడుతున్నాడు. తాజాగా ప్రాక్టీస్ లో శ్రీలంక యువ పేసర్ పతిరణ బౌలింగ్ లో ధోని హెలికాప్టర్ షాట్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియో సీఎస్కే సోషల్ మీడియాలో పోస్టు చేసింది. వింటేజీ ధోని ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
43 ఏళ్ల వయసులోనూ పవర్ ఫుల్ హిట్టింగ్ చేస్తున్న ధోనీని చూసి ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు. రాబోయే సీజన్ లో బౌలర్లకు ధోని చుక్కలు చూపించడం ఖాయమనే కామెంట్లు వస్తున్నాయి.
ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించి దాదాపు అర దశాబ్దం అవుతుంది. భారత కెప్టెన్సీని వదులుకుని దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతున్నాయి. టెస్ట్ క్రికెట్ నుంచి నిష్క్రమించి దాదాపు 11 ఏళ్లు గడుస్తున్నాయి. అయినప్పటికీ, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మైదానంలోనూ, ఐపీఎల్ లోనూ ధోని ప్రభావం కొనసాగుతోంది. ఈ సీజన్ లో ధోనిని అన్ క్యాప్డ్ ఆటగాడిగా రిటైన్ చేసుకునేందుకు నియమాలను మార్చడం దీనికి నిదర్శనం.
ఐపీఎల్ మొదటి సీజన్ లో ఆడిన ఆటగాళ్లలో ధోని మాత్రమే ఇప్పటికీ లీగ్ లో ఆడుతున్నాడు. ఇది అతని 18వ ఐపీఎల్ సీజన్. క్రికెట్ లో అతనికి 25వ సంవత్సరం. 2000 జనవరిలో బీహార్ తరఫున రంజీ ట్రోఫీలో సీనియర్ డెబ్యూ చేశాడు. ధోని 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్. అప్పటి నుంచి అతను ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు.
విశేషమేమిటంటే, 42 ఏళ్ల వయసులోనూ గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అతను ముఖ్యమైన ఆటగాడిగా నిలిచాడు. 11 ఇన్నింగ్స్ లో 161 పరుగులు చేశాడు. అద్భుతమైన 220.54 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. వికెట్ కీపర్ గానూ యాక్టివ్ గా కనిపించాడు.
సంబంధిత కథనం