CSK IPL 2025 Full Schedule: ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్ లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 18వ సీజన్ కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన ఈ టీమ్.. ధోనీకి చివరిదిగా భావిస్తున్న ఈ సీజన్ ను ఆరో ట్రోఫీతో ముగించి అతనికి ఘనంగా వీడ్కోలు పలకాలని పట్టుదలగా ఉంది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో సీఎస్కే ఈ సీజన్ షెడ్యూల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
ఐపీఎల్ 2025 వచ్చే శనివారం (మార్చి 22) ప్రారంభం కానుంది. ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం (మార్చి 23) తన తొలి మ్యాచ్ ను చెన్నైలోనే ముంబై ఇండియన్స్ తో ఆడనుంది. ఐపీఎల్ ఎల్ క్లాసికోగా భావించే ఈ మ్యాచ్ పై ఎంతో ఆసక్తి నెలకొంది. ఫుల్ స్టేడియం కన్ఫమ్. తొలి వారంలోనే చెన్నై టీమ్ ఏకంగా మూడు మ్యాచ్ లు ఆడనుంది.
అందరి కళ్లూ ధోనీపైనే ఉండనున్నాయి. గత రెండు, మూడు సీజన్లుగా రిటైర్మెంట్ వార్తల నేపథ్యంలో ఈసారి మాత్రం మిస్టర్ కూల్ నిష్క్రమణ ఖాయంగా కనిపిస్తోంది. దీంతో సీఎస్కే ఎక్కడ ఆడినా స్టేడియం ఫుల్ అవుతుందనడంలో సందేహం లేదు. అయితే ఈసారి హైదరాబాద్ ప్రేక్షకులకు ధోనీ ఆటను చూసే అవకాశం లేదు. ఎందుకంటే సన్ రైజర్స్ కేవలం ఒకసారి మాత్రమే అది కూడా చెన్నైలోనే ఏప్రిల్ 25న సీఎస్కేతో ఆడనుంది.
చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్
MA చిదంబరం స్టేడియం, చెన్నై
చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
MA చిదంబరం స్టేడియం, చెన్నై
రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్
బర్సాపారా క్రికెట్ స్టేడియం, గౌహతి
చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
MA చిదంబరం స్టేడియం, చెన్నై
పంజాబ్ కింగ్స్ vs చెన్నై సూపర్ కింగ్స్
న్యూ PCA స్టేడియం, న్యూ చండీగఢ్
చెన్నై సూపర్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్
MA చిదంబరం స్టేడియం, చెన్నై
లక్నో సూపర్ జెయింట్స్ vs చెన్నై సూపర్ కింగ్స్
భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో
ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్
వాంఖడే స్టేడియం, ముంబై
చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్
MA చిదంబరం స్టేడియం, చెన్నై
చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్
MA చిదంబరం స్టేడియం, చెన్నై
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్
M చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్
MA చిదంబరం స్టేడియం, చెన్నై
గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్
నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్
సంబంధిత కథనం