Champions Trophy opening ceremony: పాకిస్థాన్‌కు మరో షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఓపెనింగ్ సెర్మనీ రద్దు!
Champions Trophy opening ceremony: పాకిస్థాన్ కు మరో షాక్ తగిలింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఓపెనింగ్ సెర్మనీ రద్దయినట్లు ఆ దేశానికి చెందిన జియో టీవీ వెల్లడించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీమ్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Champions Trophy opening ceremony: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 29 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఐసీసీ ఈవెంట్ కు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ ఓపెనింగ్ సెర్మనీ రద్దయినట్లు జియో టీవీ వెల్లడించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్ కు వెళ్లే అవకాశం లేకపోవడం.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీమ్స్ ఆలస్యంగా వస్తుండటంతో పీసీబీకి మరో అవకాశం లేకుండా పోయిందని ఆ రిపోర్టు తెలిపింది.

ఛాంపియన్స్ ట్రోఫీ ఓపెనింగ్ సెర్మనీ
గత కొన్నేళ్లుగా ప్రతి ఐసీసీ ఈవెంట్ కు ముందు కెప్టెన్స్ మీట్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ టోర్నమెంట్లో పాల్గొనే కెప్టెన్లందరూ ప్రారంభానికి ముందు రోజు ఫొటోలకు పోజులిస్తారు.
కానీ ఈసారి మత్రం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్ కు వెళ్లే అవకాశం లేదు. దీనికితోడు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీమ్స్ కూడా కాస్త ఆలస్యంగా పాకిస్థాన్ కు వస్తున్నాయి. దీంతో కెప్టెన్స్ ఫొటోషూట్ తోపాటు ఓపెనింగ్ సెర్మనీ కూడా రద్దయినట్లు జియోటీవీ వెల్లడించింది. దీనిపై ఇప్పటి వరకూ ఐసీసీ ఏ ప్రకటనా జారీ చేయలేదు.
1996 వరల్డ్ కప్ తర్వాత పాకిస్థాన్ లో జరుగుతున్న తొలి ఐసీసీ ఈవెంట్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ. అయితే దీని కోసం పాకిస్థాన్ కు రాబోమని ఇండియన్ టీమ్ తేల్చి చెప్పడంతో దుబాయ్ లోనూ మ్యాచ్ లు జరుగుతున్నాయి. అదే పెద్ద దెబ్బ అనుకుంటే ఇప్పుడు ఓపెనింగ్ సెర్మనీని కూడా రద్దు చేయాల్సి రావడం పీసీబీకి మింగుడు పడటం లేదు.
ఆలస్యంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీమ్స్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరాచీలో జరగాల్సిన కెప్టెన్స్ మీట్ కోసం వెళ్లడం లేదని తేలిపోయింది. అటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీమ్స్ షెడ్యూల్ కూడా చాలా బిజీగా ఉంది. ఇంగ్లండ్ టీమ్ ఫిబ్రవరి 18న, ఆస్ట్రేలియా ఫిబ్రవరి 19న పాకిస్థాన్ లో అడుగుపెట్టనున్నాయి.
ఆఫ్ఘనిస్థాన్ టీమ్ ఫిబ్రవరి 12న రానుండగా.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా అంతకుముందే ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు పాకిస్థాన్ తో ట్రై సిరీస్ కోసం ముందే వెళ్తున్నాయి. ఇటు ఇండియా, బంగ్లాదేశ్ టీమ్స్ ఫిబ్రవరి 15న దుబాయ్ లో అడుగుపెట్టనున్నాయి.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీమ్స్ తమకు కేటాయించిన వామప్ మ్యాచ్ లు కూడా ఆడటం లేదు. ఈ రెండు టీమ్స్ నేరుగా టోర్నమెంట్లోకి అడుగుపెట్టనున్నాయి. ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ టీమ్ అది ముగిసిన తర్వాత వారం బ్రేక్ తీసుకొని నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడానికి పాకిస్థాన్ వెళ్లనుంది. అటు శ్రీలంకలో ఉన్న ఆస్ట్రేలియా టీమ్ ఫిబ్రవరి 14న అక్కడి నుంచి బయలుదేరనుంది. మెగా టోర్నీకి ముందు పెద్దగా టైమ్ లేకపోవడంతో వామప్ మ్యాచ్ లు రద్దు చేసుకుంది.
సంబంధిత కథనం