Rachin Ravindra Records: రచిన్ రవీంద్ర.. కేరాఫ్ రికార్డ్స్.. అవేంటో ఓ లుక్కేయండి-champions trophy new zealand vs south africa rachin ravindra creates world record 5 centuries in icc tournaments ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rachin Ravindra Records: రచిన్ రవీంద్ర.. కేరాఫ్ రికార్డ్స్.. అవేంటో ఓ లుక్కేయండి

Rachin Ravindra Records: రచిన్ రవీంద్ర.. కేరాఫ్ రికార్డ్స్.. అవేంటో ఓ లుక్కేయండి

Rachin Ravindra Records: న్యూజిలాండ్ యంగ్ బ్యాటర్ రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రెండో సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేశాడు. రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న రచిన్.. అందుకున్న ఘనతలేంటో ఓ లుక్కేయండి.

దక్షిణాఫ్రికాపై సెంచరీతో సత్తాచాటిన రచిన్ రవీంద్ర (AP)

న్యూజిలాండ్ యంగ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర రికార్డుల వేటలో సాగిపోతున్నాడు. 25 ఏళ్ల ఈ డాషింగ్ ప్లేయర్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రెండో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో దక్షిణాఫ్రికాపై సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ శతకంతో కొన్ని రికార్డులు కొల్లగొట్టాడు. ప్రపంచ రికార్డులూ నమోదు చేశాడు.

  • 32వ వన్డే ఆడుతున్న రచిన్ 5 సెంచరీలు చేశాడు. అయితే ఈ 5 శతకాలు కూడా ఐసీసీ టోర్నీల్లోనే చేయడం విశేషం. 2023 వన్డే ప్రపంచకప్ లో మూడు సెంచరీలు చేసిన రచిన్.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు శతకాలు బాదేశాడు.
  • వన్డే కెరీర్ లో తొలి 5 హండ్రెడ్స్ ను ఐసీసీ టోర్నీల్లోనే సాధించిన ఏకైక బ్యాటర్ గా రచిన్ రవీంద్ర వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. బంగ్లాదేశ్ బ్యాటర్ మహ్మదుల్లా (4 సెంచరీలు) రికార్డును రచిన్ బ్రేక్ చేశాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యంత వేగంగా అయిదు సెంచరీలు చేసిన ఆటగాడిగా శిఖర్ ధావన్ రికార్డును రచిన్ తిరగరాశాడు.
  • ఐసీసీ వన్డే టోర్నీ (ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ)ల్లో రచిన్ సగటు 67గా ఉంది. 13 ఇన్నింగ్స్ ల్లో 804 పరుగులు చేశాడు. ఈ టోర్నీల్లో కనీసం 750 పరుగులు చేసిన బ్యాటర్లలో రచిన్ దే బెస్ట్ యావరేజ్.
  • ఒకే ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన న్యూజిలాండ్ బ్యాటర్ గా రచిన్ రవీంద్ర నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు చేసిన గేల్, గంగూలీ, సయ్యద్ అన్వర్, గిబ్స్, ఉపుల్ తరంగ, షేన్ వాట్సన్, శిఖర్ ధావన్ సరసన చేరాడు.
  • న్యూజిలాండ్ తరపున అతి తక్కువ ఇన్నింగ్స్ ల్లో 5 వన్డే సెంచరీలు చేసిన రెండో ఆటగాడు రచిన్. 28 ఇన్నింగ్స్ ల్లో రచిన్ 5 సెంచరీలు చేశాడు. డెవాన్ కాన్వే (22) ముందున్నాడు.
  • కేన్ విలియమ్సన్ (24 ఏళ్ల 165 రోజులు) తర్వాత అతిపిన్న వయస్సులో 5 వన్డే సెంచరీలు చేసిన కివీస్ బ్యాటర్ గా రచిన్ రవీంద్ర (25 ఏళ్ల 107 రోజులు) నిలిచాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం