Champions Trophy Live Streaming: రేపటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇండియా షెడ్యూల్ ఇదే.. లైవ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
Champions Trophy Live Streaming: ఛాంపియన్స్ ట్రోఫీ సమరానికి టైమ్ దగ్గర పడింది. బుధవారం (ఫిబ్రవరి 19) నుంచి మార్చి 9 వరకు క్రికెట్ లో టాప్ 8 టీమ్స్ తలపడబోతున్నాయి. మరి ఈ మెగా టోర్నీ లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలో ఇక్కడ తెలుసుకోండి.

Champions Trophy Live Streaming: ఛాంపియన్స్ ట్రోఫీ 8 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ వస్తోంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్థాన్, దుబాయ్ లలో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో బుధవారం (ఫిబ్రవరి 19) డిఫెండింగ్ ఛాంపియన్, ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. మరి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లను ఎప్పుడు, ఎక్కడ చూడాలి? లైవ్ స్ట్రీమింగ్ ఫ్రీగా చూసే అవకాశం ఉందా అనే విషయాలు చూడండి.
ఛాంపియన్స్ ట్రోఫీ లైవ్ స్ట్రీమింగ్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లైవ్ స్ట్రీమింగ్ జియోహాట్‌స్టార్ లో చూడొచ్చు. ఈ మ్యాచ్ లను ఫ్రీగా చూడొచ్చని ఇప్పటికే ఆ ప్లాట్‌ఫామ్ అనౌన్స్ చేసింది. ఈ మధ్య జియో, హాట్‌స్టార్ కలిసి జియోహాట్‌స్టార్ అనే కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్ గా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లను టీవీ ఛానెల్లో చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, స్పోర్ట్స్ 18 ఛానెళ్లలో చూడొచ్చు.
ఇంగ్లిష్, హిందీ, తెలుగు, కన్నడ, తమిళం భాషల్లో మ్యాచ్ లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం బుధవారం (ఫిబ్రవరి 19) మధ్యాహ్నం 2.30 గంటలకు కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఇందులో పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడతాయి.
ఈ మధ్యే ఈ రెండు టీమ్స్ సౌతాఫ్రికా కూడా పాల్గొన్న ముక్కోణపు సిరీస్ లో తలపడిన విషయం తెలిసిందే. ఆ సిరీస్ ఫైనల్లో పాకిస్థాన్ ను ఓడించి న్యూజిలాండ్ విజేతగా నిలిచింది.
ఛాంపియన్స్ ట్రోఫీ.. ఏ గ్రూపులో ఎవరు?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మొత్తం 8 టీమ్స్ పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఎలో ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి. ఇక గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్ టీమ్స్ తలపడనున్నాయి.
ఈ రెండు గ్రూపుల నుంచి టాప్ 2లో నిలిచిన రెండేసి టీమ్స్ సెమీఫైనల్ చేరతాయి. అక్కడ గెలిచిన రెండు టీమ్స్ మార్చి 9న జరిగే ఫైనల్లో తలపడతాయి. ఇండియా మ్యాచ్ లన్నీ దుబాయ్ లో జరగనున్నాయి. ఒకవేళ ఇండియా ఫైనల్ చేరితే ఆ మ్యాచ్ కూడా దుబాయ్ లోనే ఉంటుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా షెడ్యూల్ ఇదీ
ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలో ఇండియా మొత్తం మూడు మ్యాచ్ లు ఆడుతుంది. మన టీమ్ పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లతో కలిసి గ్రూప్ ఎలో ఉంది. టీమిండియా తొలి మ్యాచ్ గురువారం (ఫిబ్రవరి 20) బంగ్లాదేశ్ తో ఆడుతుంది. ఈ మ్యాచ్ దుబాయ్ లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది.
మన కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక ఇండియా, పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్ వచ్చే ఆదివారం (ఫిబ్రవరి 23) దుబాయ్ లోనే జరగనుంది. ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం 2.30 గంటలకే ప్రారంభం కానుంది. చివరిదైన మూడో మ్యాచ్ ను ఇండియన్ టీమ్ మార్చి 2న న్యూజిలాండ్ తో ఆడుతుంది.
సంబంధిత కథనం