Champions Trophy India Squad 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ఇదే.. శుభ్‌మన్ కు వైస్ కెప్టెన్సీ.. కరుణ్‌కు నో ఛాన్స్
Champions Trophy India Squad 2025: ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లండ్‍తో వన్డే సిరీస్ కోసం 15 మందితో కూడిన టీమిండియాను శనివారం (జనవరి 18) సెలెక్టర్లు ఎంపిక చేశారు. వచ్చే నెల 19 నుంచి మార్చి 9 వరకు దుబాయ్, పాకిస్థాన్ లలో ఈ మెగా టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే.
Champions Trophy India Squad 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఇంగ్లండ్‍తో వన్డే సిరీస్ టీమిండియాను ఎంపిక చేసింది నేషనల్ సెలెక్షన్ కమిటీ. 15 మందితో కూడిన ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ కాగా.. వైస్ కెప్టెన్సీ శుభ్‌మన్ గిల్ కు దక్కడం గమనార్హం. విజయ్ హజారే ట్రోఫీలో టాప్ ఫామ్ లో ఉన్న కరుణ్ నాయర్ కు జట్టులో చోటు దక్కలేదు. అటు మహ్మద్ సిరాజ్ కు కూడా ఛాన్స్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ఇంగ్లండ్‍తో జరిగే వన్డే సిరీస్‍కు కూడా అదే జట్టు ఉండనుంది.
రెండున్నర గంటల పాటు సమావేశం
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ.. శనివారం (జనవరి 18) ముంబైలో ప్రత్యేకంగా సమావేశమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ సమావేశానికి హాజరయ్యాడు. మధ్యాహ్నం 12.30 గంటలకే టీమ్ ను ప్రకటించాల్సి ఉన్నా.. చాలా ఆలస్యమైంది. సెలెెక్షన్ కమిటీ మీటింగ్ చాలాసేపు సాగింది. రెండున్నర గంటలు ఆలస్యంగా టీమ్ ను ప్రకటించారు.
టాప్ ఫామ్ లో ఉన్న కరుణ్ నాయర్ ను ఎంపిక చేయకపోవడంపై అజిత్ అగార్కర్ స్పందించాడు. అతడు తమ దృష్టిలో ఉన్నాడని, ఒకవేళ ఇప్పుడు ఎంపిక చేసిన జట్టులో ఎవరైనా గాయపడితే.. నాయర్ పై చర్చిస్తామని చెప్పాడు. ఇక సిరాజ్ విషయానికి వస్తే అతడు పాత బంతితో అంత సమర్థంగా బౌలింగ్ చేయడం లేదని, అందుకే పక్కన పెట్టినట్లు తెలిపాడు. వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు కూడా మరోసారి మొండిచేయే ఎదురైంది. రిషబ్ పంత్ కే సెలెక్టర్లు ఓటేశారు.
జట్టులో నలుగురు స్పిన్నర్లు, నలుగురు పేస్ బౌలర్లు ఉండగా.. పంత్, రాహుల్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నారు. నలుగురు స్పిన్నర్లు అక్షర్, సుందర్, కుల్దీప్, జడేజా ఉండగా.. బుమ్రా, షమి, అర్ష్‌దీప్, హార్దిక్ పేస్ బౌలర్లు ఉండనున్నారు. ఇక స్పెషలిస్టు బ్యాటర్లుగా రోహిత్, గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్ ఉన్నారు. బుమ్రా పూర్తి ఫిట్‌గా లేడని, అతని ఫిట్‌నెస్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని అగార్కర్, రోహిత్ తెలిపారు.
వచ్చే నెల 19 నుంచి మార్చి 9 వరకు దుబాయ్, పాకిస్థాన్ లలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ మెగా టోర్నీలో ఇండియన్ టీమ్ గ్రూప్-ఏలో ఉంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్థాన్ తో, మార్చి 2 న్యూజిలాండ్ తో ఆడాల్సి ఉంది. ఇండియా మ్యాచ్ లన్నీ దుబాయ్ లోనే జరగనున్నాయి. అంతకు ముందు ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 12 మధ్య భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఇంగ్లండ్ వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి ఇదే జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే, బుమ్రా సిద్ధం కాకపోతే వన్డే సిరీస్‍లో హర్షిత్ రాణా ఉంటాడు. ఈ బ్యాకప్ ఆప్షన్ ఒక్కటే వన్డే సిరీస్ జట్టులో మార్పుగా ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజ