Champions Trophy: ఒక్కో టికెట్ కాస్ట్ లక్షపైనే - గంటలోనే ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు మొత్తం సేల్!
Champions Trophy: ఛాంఫియన్స్ ట్రోఫీలో ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది. ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్ని ఐసీసీ సోమవారం ప్రారంభించింది. సేల్ మొదలైన గంటలోపే టికెట్లు మొత్తం అమ్ముడుపోయాయి.
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఫిబ్రవరి 23న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది. దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. సోమవారం ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఆన్‌లైన్ టికెట్ల సేల్‌ను ఐసీసీ ప్రారంభించింది.

సేల్ మొదలైన గంటలోపే టికెట్లు మొత్తం అమ్ముడుపోయాయి. సేల్ ముగిసే టైమ్‌కు కూడా లక్షయాభై వేలకు మందికి పైనే క్రికెట్ ఫ్యాన్స్ టికెట్ల కోసం ఆన్‌లైన్‌లో వెయింటింగ్‌లో ఉన్నట్లు ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేశాడు.
లక్షకుపైనే...
టికెట్ల కాస్ట్ భారీగానే ఉంది. ప్లాటినం కేటగిరీలో 2000 దీనార్లు (59 వేలు), గ్రాండ్ లాంజ్ కేటగిరీలో 5000 దీనార్లు (లక్ష పద్దెనిమిది వేలుపైనే ) ఉన్నాయి. అయినా కూడా గంట లోపే టికెట్లు అమ్ముడుపోవడం మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా క్రికెట్ ఫ్యాన్స్ చెబుతోన్నారు. ఇంత తక్కువ టైమ్‌లోనే టికెట్లు మొత్తం అమ్ముడుపోవడం క్రికెట్ హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైమ్ అని, ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ రికార్డును క్రియేట్ చేసిందని క్రికెట్ వర్గాలు చెబుతోన్నాయి.
హైబ్రీడ్ విధానంలో...
ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. కానీ క్రికెటర్ల భద్రతా దృష్ట్యా పాకిస్థాన్‌లో పర్యటించడానికి బీసీసీఐ తిరస్కరించింది. దాంతో ఇండియా మ్యాచ్‌లను హైబ్రీడ్ విధానంలో దుబాయ్‌లో నిర్వహించబోతున్నారు.
చివరగా గత ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాతో పాకిస్థాన్ తలపడింది. ఈ మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై టీమిండియా విజయాన్ని సాధించింది.
రెండు గ్రూప్స్...
ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ కోసం మొత్తం ఎనిమిది జట్లు పోటీపడబోతున్నాయి. గ్రూప్‌లో ఏ ఇండియా, పాకిస్థాన్‌తో పాటు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి. గ్రూప్ బీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆప్ఘనిస్తాన్ స్థానం దక్కించుకున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఆతిథ్య పాకిస్థాన్ తలపడనుంది.