Virat Kohli Pub: విరాట్ కోహ్లీకి చెందిన పబ్‍పై కేసు నమోదు-case register against virat kohli owned pub one8 commune ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli Pub: విరాట్ కోహ్లీకి చెందిన పబ్‍పై కేసు నమోదు

Virat Kohli Pub: విరాట్ కోహ్లీకి చెందిన పబ్‍పై కేసు నమోదు

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 09, 2024 02:15 PM IST

Virat Kohli - One8 Commune: విరాట్ కోహ్లీకి చెందిన ఓ పబ్‍పై కేసు నమోదైంది. బెంగళూరులోని ఎంజీ రోడ్డులో ఉన్న పబ్‍పై పోలీసులు ఎఫ్‍ఐఆర్ ఫైల్ చేశారు.

Virat Kohli Pub: విరాట్ కోహ్లీకి చెందిన పబ్‍పై కేసు నమోదు
Virat Kohli Pub: విరాట్ కోహ్లీకి చెందిన పబ్‍పై కేసు నమోదు

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చాలా వ్యాపారాలు ఉన్నాయి. వాటిలో వన్8 కమ్యూన్ రెస్టారెంట్స్, పబ్‍లు కూడా ఉన్నాయి. అయితే, కోహ్లీ యజమానిగా ఉన్న ఓ పబ్‍పై కేసు నమోదైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో ఉన్న వన్8 కమ్యూన్‍ రెస్టారెంట్, పబ్‍పై పోలీసులు ఎఫ్‍ఐఆర్ పెట్టారు. రాత్రి అనుమతి ఇచ్చిన సమయం దాటిన తర్వాత కూడా పబ్ తెరిచే ఉంచారని పోలీసులు కేసు నమోదు చేశారు.

yearly horoscope entry point

టైమ్ అయినా బంద్ చేయలేదని..

అనుమతి ఇచ్చిన సమయం ముగిసినా పబ్ క్లోజ్ చేయకపోవటంతో వన్8 కమ్యూన్ పబ్ మేనేజర్‌పై బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‍లో కేసు నమోదైంది. అనుమతి ఇచ్చిన టైమ్ కంటే మించి తెరిచి ఉంచిన కొన్ని వ్యాపారాలపై పోలీసులు తనిఖీలు చేశారని, అందులో భాగంగా కోహ్లీకి చెందిన పబ్‍ను కూడా పరిశీలించారని తెలుస్తోంది. అర్ధరాత్రి ఒంటి గంటకే పబ్ బంద్ చేయాల్సి ఉండగా.. 1.30 గంటల సమయంలోనూ తెరిచే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

జూలై 6వ తేదీన పాట్రోల్ డ్యూటీలో భాగంగా పోలీసులు ఈ తనిఖీలు చేసినట్టు మీడియా రిపోర్టులు బయటికి వచ్చాయి. అర్ధరాత్రి 1.20 గంటల సమయంలో ఎస్ఐ తనిఖీలు చేశారని, అప్పటికే పబ్ నడుస్తుండటంతో కేసు నమోదు చేశారని తెలుస్తోంది. “1.30 గంటల వరకు నడుస్తూనే ఉన్న 3-4 పబ్‍లపై మేం కేసులు పెట్టాం. మ్యూజిక్ గట్టిగా ప్లే చేస్తున్నారని కూడా మాకు ఫిర్యాదులు వచ్చాయి. అర్ధరాత్రి 1 వరకే పబ్‍లు నడుపుకునేందుకు అనుమతి ఉంది. ఆ తర్వాత లేదు” అని సెంట్రల్ డీసీపీ వెల్లడించారు.

విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ రెస్టారెంట్లు.. ఢిల్లీ, ముంబై, పుణె, కోల్‍కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఉన్నాయి. చిన్నస్వామి స్టేడియం సమీపంలోని రత్నం కాంప్లెక్స్ ఆరో అంతస్తులో గతేడాది డిసెంబర్‌లోనే పబ్ మొదలైంది. కబ్బన్ పార్క్ అందాలను చూస్తూ ఈ రెస్టారెంట్‍లో ఫుడ్ ఎంజాయ్ చేయవచ్చు. ఐపీఎల్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున మొదటి నుంచి ఆడుతున్న కోహ్లీకి ఆ సిటీతో ఎంతో అనుబంధం ఉంది.

కాగా, ముంబైలోని కోహ్లీకి చెందిన రెస్టారెంట్ గతేడాది ఓ వివాదంలో చిక్కుకుంది. పంచెతో వెళ్లిన ఓ వ్యక్తిని వన్8 కమ్యూన్ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. బయటికి పంపేశారు. దీనిపై అప్పట్లో దుమారం రేగింది.

లండన్ వెకేషన్‍లో మవిరాట్

టీమిండియా గత నెలలో టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో విరాట్ కోహ్లీ చాలా ఎమోషనల్ అయ్యాడు. దక్షిణాఫ్రికాపై ఫైనల్‍లో అద్భుతమైన అర్ధ శకతం చేశాడు కోహ్లీ. భారత్ విజయం కీలకపాత్ర పోషించి.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. 17 ఏళ్ల తర్వాత భారత్ టీ20 టైటిల్ గెలువడంతో భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు విరాట్. అయితే, ఈ ట్రోఫీ గెలిచాక అంతర్జాతీయ టీ20లకు కోహ్లీ గుడ్‍బై చెప్పాడు. ఇక భారత్ తరఫున టెస్టులు, వన్డేలు ఆడనున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ లండన్‍లో విహరిస్తున్నాడు. రిలాక్స్ అయ్యేందుకు వెకేషన్‍కు వెళ్లాడు.

Whats_app_banner