IPL 2025 Points Table: సీఎస్కే ప్లేఆఫ్ ఛాన్స్ ఎంత? సన్ రైజర్స్ పరిస్థితి ఏంటి? పాయింట్ల టేబుల్ ఇలా
IPL 2025 Points Table: ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. అయిదు సార్లు ఛాంపియన్స్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములతో ఢీలా పడ్డాయి. ముఖ్యంగా వరుసగా అయిదు మ్యాచ్ లో ఓడిన సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్స్ ప్రమాదంలో పడింది. పాయింట్ల టేబుల్ ఇదే.
ఐపీఎల్ 2025లో అయిదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములతో సాగుతోంది. వరుసగా అయిదు మ్యాచ్ ల్లో ఓడింది. ఈ సీజన్ లో ప్లేఆఫ్ అవకాశలను ప్రమాదంలో పడేసుకుంది. 6 మ్యాచ్ లాడిన సీఎస్కే అయిదు ఓడింది. ఓ మ్యాచ్ గెలిచింది. 2 పాయింట్లతో తొమ్మిదో ప్లేస్ లో ఉంది. -1.554 నెట్ రన్ రేట్ తో ఆ టీమ్ వెనుకబడింది.
ప్లేఆఫ్స్ చేరాలంటే
ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే కనీసం 7 మ్యాచ్ లు గెలవాలి. 14 పాయింట్లు సాధించాలి. ప్రతి టీమ్ 14 మ్యాచ్ లు ఆడుతుంది. సీఎస్కే ఇప్పటికే 6 మ్యాచ్ లాడింది. కానీ ఒకటే గెలిచింది. అంటే ఆ టీమ్ ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే మిగతా 8 మ్యాచ్ ల్లో తప్పనిసరిగా 6 అయితే గెలవాలి. కానీ ప్రస్తుతం ఆ టీమ్ ఫామ్ చూస్తే అది కష్టమే అనిపిస్తోంది. ఈ సీజన్ లో సీఎస్కే ప్లేఆఫ్స్ ఆశలను ఫ్యాన్స్ వదులుకోవాల్సిందేనేమో!
ఐపీఎల్ 2025 పాయింట్ల టేబుల్ లో లాస్ట్ ప్లేస్ లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఆ టీమ్ 5 మ్యాచ్ ల్లో ఒకటే గెలిచింది. 4 ఓడింది. -1.629 నెట్ రన్ రేట్ తో లాస్ట్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఆ టీమ్ ఇంకా 9 మ్యాచ్ లు ఆడనుంది. మరి వరుస విజయాలు సాధించి ప్లేఆఫ్ రేసులో నిలుస్తుందేమో చూడాలి.
టాప్ లో గుజరాత్
ఐపీఎల్ 2025 పాయింట్ల టేబుల్ లో టాప్ ప్లేస్ లో గుజరాత్ టైటాన్స్ కొనసాగుతోంది. ఆ టీమ్ 5 మ్యాచ్ ల్లో4 గెలిచింది. 8 పాయింట్లు సాధించింది. 1.413 నెట్ రన్ రేట్ తో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కు అసలు ఓటమన్నదే లేదు. ఆ టీమ్ ఆడిన 4 మ్యాచ్ ల్లోనూ నెగ్గింది. అయితే నెట్ రన్ రేట్ (1.278)లో గుజరాత్ కంటే వెనుకబడింది.
మూడు విక్టరీలు
డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ (6 మ్యాచ్ లు), ఆర్సీబీ (5), పంజాబ్ కింగ్స్ (4), లక్నో సూపర్ జెయింట్స్ (5) మూడేసి విక్టరీల చొప్పున సాధించాయి. ఈ నాలుగు టీమ్స్ ఆరు పాయింట్లతో ఉన్నాయి. కానీ నెట్ రన్ రేట్ లో తేడా కారణంగా కేకేఆర్, ఆర్సీబీ, పంజాబ్, లక్నో వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో ఉన్నాయి.
ఏడో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచ్ ల్లో రెండు గెలిచింది. ఎనిమిదో స్థానంలో ఉన్న ముంబయి ఇండియన్స్ 5 మ్యాచ్ ల్లో ఒకటే గెలిచింది. ముంబయి ఇండియన్స్ కూడా ప్లేఆఫ్ చేరాలంటే శక్తికి మించి శ్రమించాల్సిందే.
సంబంధిత కథనం