champions trophy: కెప్టెన్ లేడు.. ఇంజూరీ టెన్షన్.. అయ్యో ఆస్ట్రేలియా.. ఛాంపియన్స్ ట్రోఫీలో మెరిసేనా?
champions trophy: మరో 8 రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభమవుతుంది. ఫిబ్రవరి 19న ఈ ఐసీసీ టోర్నీకి తెరలేస్తుంది. ఈ టోర్నీలో పోటీపడే ఆస్ట్రేలియా జట్టు పరిస్థితి ఎలా ఉంది? కెప్టెన్ కమిన్స్ లేడు, మరోవైపు గాయాలు. మరి టోర్నీలో సత్తాచాటేనా?

ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడే 8 జట్లలో చూసుకుంటే ఆటగాళ్ల ఇంజూరీతో ఎక్కువగా ఇబ్బంది పడుతోంది ఆస్ట్రేలియా జట్టే. ముఖ్యంగా కెప్టెన్ కమిన్స్ ఇంజూరీతో దూరమవడం ఆ జట్టును మరింత ప్రాబ్లమ్ లోకి నెట్టింది. ఇక ఆల్ రౌండర్లలో మిచెల్ మార్ష్ గాయంతో టోర్నీకి మిస్సవగా.. స్టాయినిస్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు.
గాయాలే సమస్య
ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిలే లక్ష్యంగా బరిలో దిగబోతున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు గాయాలే అతిపెద్ద సమస్య. కెప్టెన్ కమిన్స్ చీలమండ గాయంతో, పేసర్ జోష్ హేజిల్ వుడ్ హిప్ ప్రాబ్లమ్ తో, మిచెల్ మార్ష్ కూడా మరో ఇంజూరీతో జట్టుకు దూరమయ్యారు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే జట్టుకు ఎంపికైన తర్వాత ఆల్ రౌండర్ మార్కస్ స్టాయినిస్ వన్డేలకు రిటైర్మెంట్ ఆనౌన్స్ చేయడం అసలు ఊహించనిదే.
అదే వీక్ నెస్
కీలక ఆటగాళ్ల ఇంజూరీ కారణంగా ఆసీస్ కోర్ టీమ్ దెబ్బ తింది. కొత్త కాంబినేషన్ తో ఈ మెగా టోర్నీలో ఆడబోతోంది. ఈ ఆటగాళ్లతో జట్టుగా అడ్జస్ట్ కావడానికి సమయం పడుతుంది. ఇక పేస్ బౌలింగ్ లోనూ లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. స్టార్క్ పైనే పూర్తి భారం పడే అవకాశముంది. నాథన్ ఎలిస్, పేస్ ఆల్ రౌండర్ ఆరోన్ హార్డీ ఏ మేరకు రాణిస్తారో చూడాలి.
అదే బలం
ఈ ఆస్ట్రేలియా జట్టుకు బ్యాటింగ్ పెద్ద స్ట్రెంత్. సీనియర్ ఆటగాళ్లు స్మిత్, మ్యాక్స్ వెల్ తో పాటు ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ లాంటి ప్రమాదకర ఆటగాళ్లున్నారు. ముఖ్యంగా స్మిత్ సంచలన ఫామ్ లో ఉన్నాడు. ఇక హెడ్ ఎంత డేంజరసో తెలిసిందే. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో అతను ఒంటిచేత్తో కంగారూ జట్టును గెలిపించాడు. ఆస్ట్రేలియా 2006, 2009 లో ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది.
సంబంధిత కథనం