Bumrah injury update: ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బౌలింగ్ స్టార్ట్ చేసిన బుమ్రా.. దుబాయ్ తీసుకెళ్లడంపై సస్పెన్స్
Bumrah injury update: భారత క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. వెన్నెముక గాయం నుంచి కోలుకుంటున్న అతడు తిరిగి బౌలింగ్ ప్రారంభించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అతను ఆడటంపై బీసీసీఐ మంగళవారం (ఫిబ్రవరి 11) తుది నిర్ణయం తీసుకోనుంది.

బుమ్రా యాక్షన్ మోడ్
భారత స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా నెమ్మదిగా యాక్షన్ మోడ్ లోకి దిగుతున్నాడు. వెన్నెముక గాయం నుంచి కోలుకుంటున్న అతను జాతీయ క్రికెట్ అకాడమీలో వైద్యులు, బీసీసీఐ టీమ్ పర్యవేక్షణలో బౌలింగ్ ప్రారంభించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ దిశగా భారత క్రికెట్ జట్టుకు, అభిమానులకు ఇది గుడ్ న్యూస్. మొదట్లో ఒకేసారి రెండు ఓవర్లు, ఆ తర్వాత మూడు, ఇప్పుడు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేస్తూ నెమ్మదిగా తన బౌలింగ్ పనిభారాన్ని పెంచుకుంటున్నాడు.
లేకుంటే కష్టమే
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా లేకపోతే అది టీమ్ఇండియా టైటిల్ అవకాశాలపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. స్టార్ పేసర్ గా ఎదిగిన బుమ్రా నిలకడైన ప్రదర్శనతో వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. ప్రతి ఫార్మాట్లోనూ కంటిన్యూస్ గా వికెట్లు పడగొడుతున్నాడు. ఒకవేళ బుమ్రా లేకపోతే భారత పేస్ దళాన్ని నడిపించే నాయకుడే కనిపించడం లేదు. శస్త్ర చికిత్స తర్వాత పునరాగమనం చేసిన షమి ఇంకా రిథమ్ అందుకోలేదు. కుర్రాళ్లు హర్షిత్ రాణా, అక్షర్ దీప్ పై పూర్తిగా డిపెండ్ అవలేని పరిస్థితి.
ఈ రోజే లాస్ట్
ఫిబ్రవరి 19న ఆరంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్లలో ఛేంజ్ చేసుకోవడానికి ఈ రోజే (ఫిబ్రవరి 11) లాస్ట్ డేట్. అర్ధరాత్రి వరకూ టైమ్ ఉంది. ఆ తర్వాత మార్పుల కోసం ఐసీసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో బుమ్రాకు చోటునిచ్చిన సంగతి తెలిసిందే. కానీ బుమ్రా ఇంకా పూర్తిగా ఫిట్ నెస్ సాధించని నేపథ్యంలో అతణ్ని దుబాయ్ తీసుకెళ్తారా లేదా? అన్నది సస్పెన్స్ గా మారింది. దీనికి మంగళవారం (ఫిబ్రవరి 11) బీసీసీఐ తెరదించనుంది.
బుమ్రాను ఆడించాలనే
ఛాంపియన్స్ ట్రోఫీలో ఏదో ఒక దశలో బుమ్రాను ఆడించాలనే లక్ష్యంతోనే బీసీసీఐ ఉంది. అందుకే బుమ్రా ఇంజూరీని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తోంది. ఇప్పటికే అతనికి స్కానింగ్ లు నిర్వహించారు. బీసీసీఐ ఫిట్ నెస్ నిపుణుల పర్యవేక్షణలో తన బౌలింగ్ పనిభారాన్ని అతను క్రమంగా పెంచుకుంటున్నాడు.ఫిబ్రవరి 15 న భారత జట్టు దుబాయ్ బయలుదేరే ముందు బెంగళూరులోనే ప్రాక్టీస్ మ్యాచ్లో అతన్ని పరీక్షించడానికి సమయం ఉంది.
సంబంధిత కథనం