Bumrah Injury: ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లో బుమ్రాకు చోటు? - కానీ టోర్నీ ఆడటం మాత్రం డౌట్!
Bumrah Injury: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. వెన్ను గాయం కారణంగా టోర్నీ మొత్తానికి బుమ్రా దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసంఅనౌన్స్ చేయనున్న టెంపరరీ టీమ్‌లో మాత్రం బుమ్రాకు స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది.
Bumrah Injury: ఛాంపియన్స్ ట్రోఫీ ముందు టీమిండియాకు పెద్ద షాక్ తగిలేదా ఉంది. గాయం కారణంగా ఈ టోర్నీ మొత్తానికి బుమ్రా దూరం కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మెడికల్ క్లియరెన్స్ తర్వాతే బుమ్రా విషయంలోసెలెక్టర్లు ఓ క్లారిటీకి రానున్నట్లుతెలుస్తోంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించే టెంపరరీ టీమ్‌లో బుమ్రా పేరును సెలెక్టర్లు చేర్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఐదో టెస్ట్‌లో...
ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదో టెస్ట్‌లో వెన్నునొప్పితో మ్యాచ్ మధ్యలోనే హాస్పిటల్‌కు వెళ్లాడు బుమ్రా. సెకండ్ ఇన్నింగ్స్‌లో గాయం కారణంగా బుమ్రా బౌలింగ్ చేయలేదు. బ్యాక్ పెయిన్ సమస్య తీవ్రంగానే ఉన్నట్లు సమాచారం. ఈ వెన్ను నొప్పికి సంబంధించి న్యూజిలాండ్ ఆర్థోపెడిక్ సర్జన్ రోవాన్ షౌటెన్‌ను బుమ్రా సంప్రదించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2023లో బుమ్రా వెన్ను గాయానికి రోవాన్ ఆధ్వర్యంలోనే సర్జరీ జరిగింది. మరోసారి గాయం తిరగబెట్టే అవకాశం ఉండటంతో బుమ్రా ఈ సర్జన్ సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు తెలిసింది.
మెడికల్ టీమ్‌తో టచ్‌లో...
బీసీసీఐ మెడికల్ టీమ్‌తో రోవాన్ టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. బుమ్రా గాయానికి సంబంధించిన అప్‌డేట్‌ను రోవాన్ స్వయంగా బీసీసీఐ వర్గాలతో చెప్పబోతున్నట్లు సమాచారం. మెడికల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతే బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతాడా లేదా అన్నది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఐసీసీ రూల్...
మరోవైపు ఐసీసీ రూల్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను జనవరి 12లోపు ఇండియా ప్రకటించాల్సివుంది. అయితే ఇదే ఫైనల్ టీమ్ కాదని, తొలుత టెంపరరీ టీమ్‌ను ప్రకటించి...గాయలు, ఫామ్ ప్రకారం తుది జట్టును ఫైనల్ చేయాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. ఈ టెంపరరీ టీమ్‌ను సెలెక్టర్లు ఫైన్ చేసినట్లు సమాచారం. అందులో బుమ్రా పేరు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.
అప్‌డేట్ వచ్చిన తర్వాతే...
వెన్ను గాయంపై అప్‌డేట్ వచ్చిన తర్వాతే ఇబ్బంది లేకుండా అతడు బౌలింగ్ చేయగలడని తెలితేనే బుమ్రాకు ఫైనల్ టీమ్‌లో కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాయంతో బుమ్రా తప్పుకుంటే అతడి స్థానంలో మరో ప్లేయర్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపికచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బుమ్రా స్థానంలో షమీ జట్టులోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియాకు దూరమైన షమీ ఛాంపియన్స్ ట్రోఫీతోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.