Bcci New Rules: బీసీసీఐ కొత్త రూల్స్ - క్రికెటర్ల ఫ్యామిలీ టూర్లపై కండీషన్స్ - అతిక్రమిస్తే కఠిన చర్యలు!
Bcci New Rules: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ షాకివ్వబోతున్నది. ఫారిన్ టూర్లకు భార్యపిల్లలను, ఫ్యామిలీ మెంబర్స్‌ను క్రికెటర్లు తీసుకెళ్లడంపై కండీషన్స్ పెళ్లింది. అంతేకాకుండా టీమిండియా బస్‌లలోనే క్రికెటర్లు ప్రయాణించాలని రూల్ పెట్టినట్లు సమాచారం.
Bcci New Rules: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ దారుణ పరాభవం నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ కొత్త రూల్స్ పెట్టినట్లు సమాచారం. ఫారిన్ టోర్నీలకు క్రికెటర్లతో పాటు వారి ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లడంపై పలు ఆంక్షలు విధించినట్లు చెబుతోన్నారు. ఈ కొత్త రూల్స్‌ను ప్రతి ఒక్క క్రికెటర్ పాటించాల్సిందేనని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ఫారిన్ టూర్లలో ఫ్యామిలీ మెంబర్స్ క్రికెటర్లు షికార్లు చేయడంపై బీసీసీఐ ఫైర్ అయినట్లు సమాచారం.

పధ్నాలుగు రోజులు మాత్రమే...
45 లేదా అంతకంటే ఎక్కువ రోజుల పాటు సాగే క్రికెట్ టోర్నమెంట్స్‌లలో క్రికెటర్లతో కలిసి వారి భార్యాపిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ కేవలం పధ్నాలుగు రోజులు మాత్రమే ఉండాలని బీసీసీఐ నిర్ణయించింది. టోర్నీ మొత్తం క్రికెటర్లతో కలిసి వారి ఫ్యామిలీ మెంబర్స్ ఉండటానికి వీలులేదని ఇటీవల జరిగిన రివ్యూ మీటింగ్‌లో బీసీసీఐ వర్గాలు కండీషన్ పెట్టినట్లు సమాచారం.
పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు సాగే టూర్స్ అయితే క్రికెటర్లతో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ ఏడు రోజులు మాత్రమే కలిసి ఉండాలని రూల్ పెట్టినట్లు సమాచారం. ఈ రూల్స్‌ను అతిక్రమించిన క్రికెటర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బీసీసీఐ ఈ మీటింగ్‌ల నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోన్నారు.
టీమిండియా బస్‌లలోనే...
టోర్నీ సమయాల్లో ఏ క్రికెటర్ అయిన టీమ్ బస్‌లోనే ప్రయాణించాలని, వ్యక్తిగతంగా జర్నీలు చేయడం కుదరదని బీసీసీఐ కండీషన్ విధించినట్లు తెలిసింది.
కోహ్లితో కలసి అనుష్క శర్మ...
విదేశీ టోర్నీలకు క్రికెటర్లతో కలిసి వారి భార్యా, పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లడం ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లి వైఫ్ అనుష్క శర్మ, కేఎల్ రాహుల్ సతీమణి అతియా శెట్టి టోర్నీ ముగిసే వరకు ఆస్ట్రేలియాలోనే ఉన్నారు. వీరితో పాటు పలువురు క్రికెటర్ల వెంట వారి ఫ్యామిలీ మెంబర్స్ ఆస్ట్రేలియాకు వెళ్లారు.
గంభీర్ మేనేజర్‌పై పంచ్...
ఫారిన్ టూర్లలను జల్సాలు తగ్గించి ఆటపై క్రికెటర్లు ఫోకస్ పెట్టాలనే ఈ కండీషన్స్ పెట్టినట్లు చెబుతోన్నారు. అంతే కాకుండా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి గౌతమ్ గంభీర్‌తో పాటు అతడి మేనేజర్ గౌరవ్ అరోరా కూడా వెళ్లాడు. టీమిండియా విడిది చేసిన హోటల్స్‌లోనే అతడు ఉన్నాడు.
ఐదు టెస్ట్ మ్యాచులను వీఐపీ బాక్స్‌లలో కూర్చొని చూశాడు. గంభీర్ వెంట అతడి మేనేజర్ ఆస్ట్రేలియాలో పర్యటించడంపై బీసీసీఐ ఫైర్ అయినట్లు సమాచారం. అతడిపై లీగల్‌గా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.