Team India: టీమిండియాను మళ్లీ గాడిలో పెట్టడానికి బీసీసీఐ మెగా ప్లాన్.. ప్లేయర్స్‌పై కఠిన ఆంక్షలు.. పది మార్గదర్శకాలు
Team India: టీమిండియాను మళ్లీ గాడిలో పెట్టడానికి బీసీసీఐ కఠిన చర్యలకు సిద్ధమైంది. ప్లేయర్స్ పై ఆంక్షలు విధిస్తోంది. పది మార్గదర్శకాలను జారీ చేసింది. ఆస్ట్రేలియా టూర్లో దారుణమైన ఓటమి తర్వాత బోర్డు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.
Team India: టీమిండియా కోసం బీసీసీఐ రంగంలోకి దిగింది. స్టార్ ప్లేయర్స్ వైఫల్యాలు, టీమ్ వరుస ఓటములతో 10 మార్గదర్శకాలను జారీ చేసింది. ఇది జట్టులో క్రమశిక్షణ, యూనిటీ, ఓ పాజిటివ్ వాతావరణం తీసుకురావడానికి ఉపయోగపడేలా వీటిని రూపొందించింది. ఇందులో భాగంగా దేశవాళీ క్రికెట్ లో కచ్చితంగా ఆడేలా ప్లేయర్స్ పై ఒత్తిడి తీసుకురానుంది.

బీసీసీఐ పది మార్గదర్శకాలు
ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గరపడుతుండటంతో టీమిండియాను మళ్లీ గాడిలో పడేయడానికి బీసీసీఐ కొన్ని కఠిన చర్యలకు సిద్ధమైంది. భవిష్యత్తులో విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు పాటించాల్సిన నిబంధనలు సహా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. అవేంటో ఒకసారి చూద్దాం.
దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే..
జాతీయ జట్టులో ఆడాలన్నా, సెంట్రల్ కాంట్రాక్టులు కావాలన్నా ప్రతి ఒక్కరూ దేశవాళీ క్రికెట్ లో ఆడాల్సిందే. విరాట్ కోహ్లి సహా పంత్, జైస్వాల్, గిల్ లాంటి వాళ్లందరూ ఇప్పుడు రంజీ ట్రోఫీ బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారు. ఎలాంటి ప్లేయర్ కైనా డొమెస్టిక్ క్రికెట్ తప్పనిసరి చేశారు.
ఫ్యామిలీతో ప్రత్యేకంగా ప్రయాణానికి నో
మ్యాచ్‌లు, ప్రాక్టీస్ సెషన్లకు ప్లేయర్స్ అందరూ టీమ్ తో కలిసి ప్రయాణించాల్సిందే. ప్రత్యేకంగా కుటుంబంతో కలిసి వెళ్లడానికి అనుమతి ఉండదు. ఒకవేళ అలా చేయాలనుకుంటే ముందుగానే హెడ్ కోచ్, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అనుమతి తీసుకోవాలి.
- ప్రాక్టీస్ సెషన్ల నుంచి ముందుగానే వెళ్లిపోయే అవకాశం లేదు. ప్లేయర్స్ అందరూ కచ్చితంగా మొత్తం సెషన్ కు అందుబాటులో ఉండాల్సిందే.
- టూర్లలో వ్యక్తిగతంగా మేనేజర్లు, ఛెఫ్స్, అసిస్టెంట్లు, సెక్యూరిటీని తీసుకెళ్లడం ఇక కుదరదు.
- ఓ సిరీస్ కొనసాగుతున్న సమయంలో ప్లేయర్స్ ఎవరూ వ్యక్తిగత షూట్స్ లేదా ఎండార్స్‌మెంట్లు పెట్టుకోకూడదు.
- 45 రోజులకు మించి విదేశీ పర్యటన ఉన్న సమయంలో ప్లేయర్స్ కు తమ కుటుంబాలతో కలిసి ఉండటానికి కేవలం రెండు వారాలు మాత్రమే ఇవ్వనున్నారు. ఆ సమయానికి మాత్రమే వాళ్ల ఖర్చును బీసీసీఐ భరిస్తుంది.
- బీసీసీఐ అధికారిక షూట్స్, ప్రమోషనల్ ఈవెంట్లు, ఇతర కార్యక్రమాలకు ప్లేయర్స్ కచ్చితంగా అందుబాటులో ఉండాల్సిందే.
- పర్యటనల్లో మ్యాచ్‌లు లేదా సిరీస్ త్వరగా ముగిసినా ప్లేయర్స్ అందరూ షెడ్యూల్ సమయానికే తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఎవరికీ ముందుగానే వెళ్లడానికి అనుమతి ఉండదు.
వచ్చే నెలలో ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్న నేపథ్యంలో టీమిండియాను మళ్లీ గాడిలో పెట్టడానికి బీసీసీఐ ఇలా కొన్ని కఠిన ఆంక్షలను విధించింది. వీటిని పాటించకపోతే ఐపీఎల్లో ఆడే అవకాశాన్ని కూడా ప్లేయర్స్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
టాపిక్