ఆ టెస్టు ఈడెన్ గార్డెన్స్ లో.. ఈ టెస్టు ఢిల్లీలో.. షెడ్యూల్ రివైజ్ చేసిన బీసీసీఐ-bcci revised indian cricket home season schedule eden gardens delhi stadium india vs west indies south africa test ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఆ టెస్టు ఈడెన్ గార్డెన్స్ లో.. ఈ టెస్టు ఢిల్లీలో.. షెడ్యూల్ రివైజ్ చేసిన బీసీసీఐ

ఆ టెస్టు ఈడెన్ గార్డెన్స్ లో.. ఈ టెస్టు ఢిల్లీలో.. షెడ్యూల్ రివైజ్ చేసిన బీసీసీఐ

నవంబర్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ ను కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ కు తరలించారు. భారత్, వెస్టిండీస్ టెస్టు ఢిల్లీలో నిర్వహించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ రివైజ్ చేసిన షెడ్యూల్ ను ప్రకటించింది.

ఈడెన్ గార్డెన్స్ స్టేడియం (Hindustan Times)

హోం సీజన్ షెడ్యూల్ లో బీసీసీఐ సోమవారం (జూన్) కొన్ని మార్పులు చేసింది. ముందుగా అక్టోబర్ 2025లో భారత్-వెస్టిండీస్ మధ్య జరిగే రెండవ టెస్ట్‌కు వేదికగా నిర్ణయించిన కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్.. ఇప్పుడు నవంబర్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగే తొలి టెస్ట్‌కు వేదిక కానుంది. భారత్-వెస్టిండీస్ మధ్య జరిగే రెండవ టెస్ట్ ఇప్పుడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది.

బీసీసీఐ ఏం చెప్పిందంటే?

"కోల్‌కతాలో జరగాల్సిన వెస్టిండీస్‌తో భారత్ రెండవ టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. అదే సమయంలో, నవంబర్ 14, 2025 నుండి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ న్యూఢిల్లీ నుండి కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌కు మార్చారు’’ అని బీసీసీఐ అధికారిక ప్రకటనలో తెలిపింది.

మహిళల వన్డే సిరీస్ కూడా

మరోవైపు చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో అవుట్‌ఫీల్డ్, పిచ్‌లను మెరుగుపరుస్తున్నారు. అందుకే భారత్-ఆస్ట్రేలియా మహిళల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ ను చెన్నై నుంచి తరలించారు. మొదటి రెండు వన్డేలు న్యూ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, న్యూ చండీగఢ్‌లో జరుగుతాయి. మూడవ, చివరి వన్డే న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. భారత్ ఎ, దక్షిణాఫ్రికా ఏ మధ్య జరిగే మూడు వన్డే మ్యాచ్‌లను బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం నుండి రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియానికి మార్చారు. ఇందుకు కారణం మాత్రం తెలియలేదు.

హోమ్ సీజన్ షెడ్యూల్

  • ఆస్ట్రేలియా మహిళల భారత పర్యటన: 1వ వన్డే - సెప్టెంబర్ 14 - న్యూ చండీగఢ్, 2వ వన్డే - సెప్టెంబర్ 17 - న్యూ చండీగఢ్, 3వ వన్డే - సెప్టెంబర్ 20 - న్యూఢిల్లీ.
  • ఆస్ట్రేలియా పురుషుల ఎ జట్టు భారత పర్యటన: 1వ మల్టీ-డే గేమ్ - సెప్టెంబర్ 16-19 - లక్నో, 2వ మల్టీ-డే గేమ్ - సెప్టెంబర్ 23-26 - లక్నో, 1వ వన్డే - సెప్టెంబర్ 30 - కాన్పూర్, 2వ వన్డే - అక్టోబర్ 3 - కాన్పూర్, 3వ వన్డే - అక్టోబర్ 5 - కాన్పూర్.
  • వెస్టిండీస్ పురుషుల భారత పర్యటన: 1వ టెస్ట్ - అక్టోబర్ 2-6 - అహ్మదాబాద్, 2వ టెస్ట్ - అక్టోబర్ 10-14 - న్యూఢిల్లీ.
  • దక్షిణాఫ్రికా పురుషుల ఎ జట్టు భారత పర్యటన: 1వ మల్టీ-డే గేమ్ - అక్టోబర్ 30-నవంబర్ 2 - బీసీసీఐ సీవోఈ, బెంగళూరు, 2వ మల్టీ-డే గేమ్ - నవంబర్ 6-9 - బీసీసీఐ సీవోఈ, బెంగళూరు, 1వ వన్డే - నవంబర్ 13 - రాజ్‌కోట్, 2వ వన్డే - నవంబర్ 16 - రాజ్‌కోట్, 3వ వన్డే - నవంబర్ 19 - రాజ్‌కోట్.
  • దక్షిణాఫ్రికా పురుషుల భారత పర్యటన: 1వ టెస్ట్ - నవంబర్ 14-18 - కోల్‌కతా, 2వ టెస్ట్ - నవంబర్ 22-26 - గువాహటి, 1వ వన్డే - నవంబర్ 30 - రాంచీ, 2వ వన్డే - డిసెంబర్ 3 - రాయ్‌పూర్, 3వ వన్డే - డిసెంబర్ 6 - విశాఖపట్నం, 1వ టీ20ఐ - డిసెంబర్ 9 - కటక్, 2వ టీ20ఐ - డిసెంబర్ 11 - న్యూ చండీగఢ్, 3వ టీ20ఐ - డిసెంబర్ 14 - ధర్మశాల, 4వ టీ20ఐ - డిసెంబర్ 17 - లక్నో, 5వ టీ20ఐ - డిసెంబర్ 19 - అహ్మదాబాద్.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం