World Cup 2023 Schedule : ప్రపంచకప్ షెడ్యూల్‌ను మార్చాలన్న హెచ్‌సీఏ.. నో.. నో.. కుదరదన్న బీసీసీఐ-bcci rejected hyderabad cricket association request to change the 2023 world cup schedule in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  World Cup 2023 Schedule : ప్రపంచకప్ షెడ్యూల్‌ను మార్చాలన్న హెచ్‌సీఏ.. నో.. నో.. కుదరదన్న బీసీసీఐ

World Cup 2023 Schedule : ప్రపంచకప్ షెడ్యూల్‌ను మార్చాలన్న హెచ్‌సీఏ.. నో.. నో.. కుదరదన్న బీసీసీఐ

Anand Sai HT Telugu
Aug 22, 2023 10:58 AM IST

World Cup 2023 Schedule : భారత్‌లో అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న 2023 వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి బీసీసీఐ, ఐసీసీ ఇప్పటికే తుది షెడ్యూల్‌ను విడుదల చేశాయి. ఇందుకోసం మొత్తం 10 జట్లు సన్నాహాలు ప్రారంభించాయి.

వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ
వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ (AFP)

వరల్డ్ కప్ షెడ్యుల్ ఇప్పటికే విడుదలైంది. మరోవైపు భద్రత దృష్ట్యా వరుసగా మ్యాచ్‌లు నిర్వహించడంపై హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, వచ్చే వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. న్యూజిలాండ్-నెదర్లాండ్స్, పాకిస్థాన్-శ్రీలంక మధ్య మ్యాచ్‌లకు భద్రతపై స్థానిక పోలీసులు ఆందోళన వ్యక్తం చేసింది. తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్టోబర్ 9 మరియు 10 తేదీల్లో జరగనున్న రెండు వరుస మ్యాచ్‌లకు భద్రతా ఏర్పాట్ల గురించి బీసీసీఐకి హామీ ఇచ్చింది.

అయితే ఈ దశలో ప్రపంచకప్ మ్యాచ్‌ల రీషెడ్యూల్ సాధ్యం కాదని హైదరాబాద్ క్రికెట్ సంస్థకు తెలియజేసింది బీసీసీఐ. బీసీసీఐతో దుర్గాప్రసాద్ చర్చలు జరిపేందుకు అంగీకరించారు. బీసీసీఐతో చర్చించామని, షెడ్యూల్ మార్చడం ప్రస్తుతానికి కుదరదని వారు చెప్పారని, అందుకే సహకరించేందుకు అంగీకరించామని ఓ ప్రకటనలో తెలిపారు.

మ్యాచ్‌ల ఏర్పాట్లపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు బీసీసీఐ తాత్కాలిక సీఈవో హేమంగ్ అమిన్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల ప్రకారం.. న్యూజిలాండ్-నెదర్లాండ్స్, పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్‌లు రెండింటికీ భద్రతా ఏర్పాట్లు చేస్తామని హైదరాబాద్ పోలీసులు హామీ ఇచ్చారు. 'బిసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఇప్పటికే స్పష్టం చేసిన విషయం మేం అర్థం చేసుకున్నాం. చివరి నిమిషంలో మార్పులు చేయడం సవాలుగా ఉంటుందని మాకు తెలిపారు. మ్యాచ్‌లను క్రమపద్ధతిలో నిర్వహించడానికి మేం ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నాం.' అని తెలిపింది హెచ్ సీఏ.

హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌తో చర్చలు జరిపామని, పూర్తి భద్రత కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారని హెచ్‌సీఏ అధికారి ఒకరు తెలిపారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2023 ICC ప్రపంచ కప్ ప్రారంభానికి కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో, అందరి దృష్టి జట్ల సన్నాహాలపైకి ఉంది. ప్రపంచ కప్ టోర్నమెంట్ అక్టోబర్ 5 న అహ్మదాబాద్‌లో ప్రారంభమవుతుంది. టిక్కెట్లు ఆగస్టు 25 నుండి విక్రయిస్తారు.