Rahul Dravid: హెడ్ కోచ్‌గా ద్రావిడ్ పదవీకాలం పెంపు? - బీసీసీఐ ఆఫర్!
Rahul Dravid: టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీ కాలాన్ని పెంచాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. బీసీసీఐ ఆఫర్‌కు ద్రావిడ్ ఆమోదం తెలపలేదని సమాచారం.
Rahul Dravid: టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలాన్ని పెంచాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్ ద్రావిడ్ మార్గదర్శనంలో టీమిండియా గత రెండేళ్లలో అద్భుతమైన విజయాల్ని అందుకున్నది. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరుకొని రన్నరప్‌గా నిలిచింది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఫైనల్ చేరుకోవడంలో ద్రావిడ్ పాత్ర ఎంతో ఉంది. అంతే కాకుండా ద్రావిడ్ కోచ్‌గా నియమితుడైన తర్వాతే వన్డేలు, టెస్ట్‌లతో పాటు టీ20ల్లో టీమిండియా నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నది. ఇటీవల వరల్డ్ కప్‌తో హెడ్ కోచ్‌గా ద్రావిడ్ పదవీకాలం ముగిసింది.
కోచ్‌గా కొత్త వ్యక్తికి ఛాన్స్ ఇవ్వడం కంటే ద్రావిడ్ పదవీకాలం పెంచడమే మంచిదనే అభిప్రాయంలో బీసీసీఐ ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనను ద్రావిడ్ ముందు బీసీసీఐ వర్గాలు ఉంచాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బీసీసీఐ ఆఫర్‌ను ద్రావిడ్ ఇంకా అంగీకరించలేదని అతడి సన్నిహితులు చెబుతోన్నారు. టీమిండియా హెడ్ కోచ్‌గా కొనసాగడానికి ద్రావిడ్ సముఖంగా లేనట్లు సమాచారం.
వరల్డ్ ఫైనల్ ఓటమి అతడిని బాధించిందని, అందుకే కోచ్‌గా కొనసాగడానికి అతడు సంసిద్ధంగా లేనట్లుగా చెబుతోన్నారు. హెడ్ కోచ్‌గా కొనసాగాలా వద్దా అనే దానిపై మరో రెండు, మూడు రోజుల్లో బీసీసీఐకి ద్రావిడ్ తన అభిప్రాయాన్ని చెప్పబోతున్నట్లు సమాచారం. ఒకవేళ బీసీసీఐ ఆఫర్‌ను ద్రావిడ్ తిరస్కరిస్తే అతడి ప్లేస్‌ను భర్తీ చేసిది ఎవరన్నది క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.