India T20 Squad: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కి 15 మందితో భారత్ జట్టు ప్రకటన, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ ఔట్
India T20 Squad for South Africa T20I: బంగ్లాదేశ్‌తో ఇటీవల టీ20 సిరీస్‌లో సత్తాచాటిన ఇద్దరు ప్లేయర్లకి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కలేదు. గంటకి 150కిమీ వేగంతో బంతులేసే మయాంక్ యాదవ్ టీమ్‌లో లేడు.

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం 15 మందితో కూడిన భారత్ జట్టుని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం రాత్రి ప్రకటించింది. నవంబరు ఆరంభంలో దక్షిణాఫ్రికా గడ్డపైకి వెళ్లనున్న టీమిండియా.. అక్కడ నవంబరు 8 నుంచి నవంబరు 15 వరకు 4 టీ20ల సిరీస్‌లో తలపడనుంది.
మయాంక్, పరాగ్ ఔట్
ఈ టీ20 సిరీస్‌ోల భారత్ జట్టుని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నడిపించనుండగా.. బంగ్లాదేశ్‌తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో తన పేస్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచిన మయాంక్ యాదవ్ గాయం కారణంగా ఈ సిరీస్‌కి దూరమయ్యాడు. అతనితో పాటు ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ కూడా గాయపడటంతో జట్టులోకి ఎంపికవలేదు. పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే జట్టులోకి వస్తాడని ఆశించినా.. అతడ్ని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు.
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం కొత్తగా జట్టులోకి ముగ్గురు ఆటగాళ్లు వచ్చారు. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున సత్తాచాటి.. ఇటీవల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన బ్యాటర్ రమణ్ దీప్ సింగ్‌కు టీమ్‌లో చోటు దక్కింది. బౌలర్లలో వైశాక్ విజయ్‌కుమార్, యశ్ దయాల్‌కి ఛాన్స్ లభించింది.
హైదరాబాదీ ప్లేయర్ రీఎంట్రీ
బంగ్లాదేశ్‌తో ఇటీవల టీ20 సిరీస్‌లో సెంచరీ బాదిన సంజు శాంసన్ జట్టులో చోటు నిలుపుకోగా.. అతనితో పాటు అభిషేక్ శర్మ దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఓపెనర్‌గా ఆడనున్నాడు. అలానే హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మను కూడా ఎట్టకేలకి మళ్లీ టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. కీపర్‌గా సంజు శాంసన్ ఉన్నప్పటికీ.. బ్యాకప్ వికెట్ కీపర్‌గా జితేష్ శర్మకి అవకాశం దక్కింది.
ఆల్ రౌండర్లలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ జట్టులో ఉన్నారు. స్పిన్ విభాగంలో రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి చోటు దక్కించుకున్నారు. అలానే ఐదుగురు పేసర్లు టీమ్‌లో ఉండనున్నారు. హార్దిక్ ఆల్ రౌండర్‌గా, ప్రధాన పేసర్లుగా అర్షదీప్ సింగ్, వైశాఖ్, అవేష్ ఖాన్, దయాల్ అందుబాటులో ఉంటారు.
భారత టీ20 జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, అవేష్ ఖాన్, యశ్ దయాల్.