Babar Azam: కెప్టెన్‌గా బాబర్ అజాం పనికిరాడు - షాహీన్ అఫ్రిదీ బెస్ట్ - పాక్ మాజీల సూచన
Babar Azam: పాకిస్థాన్ జట్టు కెప్టెన్‌గా బాబర్ అజాంను తొలగించాలని ఆ దేశ మాజీ క్రికెటర్స్ ఫైర్ అవుతోన్నారు. బాబర్ అజాం స్థానంలో షాహీన్ అఫ్రిదీని కెప్టెన్‌గా నియామించాలని డిమాండ్ చేస్తున్నారు.
Babar Azam: వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ వరుస వైఫల్యాలపై ఆ దేశ మాజీ క్రికెటర్లు సీరియస్ అవుతోన్నారు. అప్ఘనిస్తాన్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోవడం క్రికెటర్లతో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్థాన్ ప్లేయర్స్‌పై దారుణంగా ఫైర్ అవుతోన్నారు. ముఖ్యంగా బాబర్ అజాం కెప్టెన్సీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అతడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
బాబర్ అజాం స్థానంలో షాహీన్ అఫ్రిదీకి నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తే జట్టు గాడిలో పడే అవకాశం ఉందని వసీం అక్రమ్, మిస్బా ఉల్ హక్, రమీజ్ రాజా, షోయబ్ అక్తర్‌తో పాటు పలువురు మాజీ ప్లేయర్స్ అభిప్రాయపడుతోన్నారు. వైట్ బాల్ కెప్టెన్సీగా తానను తాను నిరూపించుకోవడంలో బాబర్ పూర్తిగా విఫలమయ్యాడని చెబుతున్నారు. పాకిస్థాన్ క్రికెటర్లకు రిచ్ ఫుడ్, ఎంజాయ్‌మెంట్‌పై ఉన్న శ్రద్ధ క్రికెట్ ఆడటంలో కనిపించడం లేదని విమర్శిస్తోన్నారు. పాక్ మాజీ క్రికెటర్ల కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
వరల్డ్ కప్‌లో బాబర్ అజాం దారుణంగా విఫలమయ్యాడు. కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. వరల్డ్ కప్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్ కేవలం శ్రీలంక, నెదార్లాండ్స్‌పై మాత్రమే విజయం సాధించింది. ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, అప్ఘనిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ప్రస్తుతం నాలుగు పాయింట్స్‌తో వరల్డ్ పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో పాకిస్థాన్ కొనసాగుతోంది.
పాకిస్థాన్ తన తదుపరి మ్యాచ్‌లలో సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో తలపడాల్సి ఉంది. అప్ఘనిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌లపై బాబర్ సేన గెలవడం అసాధ్యమంటూ క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.