Babar Azam on Kohli: కోహ్లి నా గురించి ఆ మాట చెప్పడం గర్వంగా ఉంది: బాబర్ ఆజం-babar azam says he feels proud by the words of kohli cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Babar Azam On Kohli: కోహ్లి నా గురించి ఆ మాట చెప్పడం గర్వంగా ఉంది: బాబర్ ఆజం

Babar Azam on Kohli: కోహ్లి నా గురించి ఆ మాట చెప్పడం గర్వంగా ఉంది: బాబర్ ఆజం

Hari Prasad S HT Telugu
Aug 31, 2023 03:53 PM IST

Babar Azam on Kohli: కోహ్లి నా గురించి ఆ మాట చెప్పడం గర్వంగా ఉంది అని అన్నాడు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం. అన్ని ఫార్మాట్లలోనూ అత్యుత్తమ బ్యాటర్లలో బాబర్ ఒకడని కోహ్లి అన్నాడు.

బాబర్ ఆజం
బాబర్ ఆజం (AFP)

Babar Azam on Kohli: పాకిస్థాన్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజంను తరచూ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లితో పోలుస్తుంటారు అక్కడి క్రికెట్ అభిమానులు. అయితే కోహ్లి ఇచ్చిన సలహాల వల్లే తన కెరీర్ ఈ స్థాయిలో ఉందని బాబర్ చెప్పడం విశేషం. ఆసియా కప్ 2023లో భాగంగా శనివారం (సెప్టెంబర్ 2) పాకిస్థాన్ తో మ్యాచ్ కు ముందు బాబర్ స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడాడు.

ఈ సందర్భంగా కోహ్లితో తొలిసారి 2019 వరల్డ్ కప్ సమయంలో కలిసిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో అప్పటి పాకిస్థాన్ లెఫ్టామ్ స్పిన్నర్.. బాబర్ ను కోహ్లికి పరిచయం చేశాడు. అప్పుడు తాను కోహ్లిని ఎన్నో ప్రశ్నలు అడిగానని, అతడు కూడా వాటికి ఓపిగ్గా సమాధానం చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు. గతేడాది కోహ్లి కూడా బాబర్ గురించి మాట్లాడాడు.

బాబర్ పై తనకు ఎంతో గౌరవం ఉందని, అతని ఆటను ఫాలో అవుతున్నానని, అన్ని ఫార్మాట్లలోనూ బెస్ట్ బ్యాటర్లలో బాబర్ ఒకడని కోహ్లి అనడం విశేషం. అలాంటి లెజెండరీ ప్లేయర్ నుంచి తనకు ఈ ప్రశంసలు దక్కడం ఎంతో గర్వంగా ఉందని తాజాగా బాబర్ అన్నాడు.

"ఎవరైనా మన గురించి గొప్పగా మాట్లాడినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. నా గురించి విరాట్ కోహ్లి కామెంట్స్ విని నాకు చాలా గర్వంగా అనిపించింది. విరాట్ లాంటి వ్యక్తి మనల్ని మెచ్చుకుంటే దానివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది" అని బాబర్ చెప్పాడు. ఇక 2019 వరల్డ్ కప్ సమయంలో కోహ్లిని కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు.

"2019 వరల్డ్ కప్ సమయంలో నేను అతన్ని కలిశాను. ఆ సమయంలో అతడు కెరీర్ పీక్ లో ఉన్నాడు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఆ సమయంలో అతని నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నేను అతన్ని చాలా ప్రశ్నలు అడిగాను. అప్పుడు నా ఆటకు ఉపయోగపడే ప్రశ్నలు అవి. వాటన్నింటికీ అతడు సమాధానమిచ్చాడు. అవి నాకు చాలా సాయం చేశాయి. చాలా బాగా అనిపించింది" అని బాబర్ చెప్పాడు.

Whats_app_banner