gambhir: మైండ్ లెస్ గంభీర్.. అక్షర్ ను పంపే దమ్ముందా? భారత కోచ్ పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు-axar patel kl rahul swap faces fury mindless experiment coach gautam gambhir cricket former cricketer criticism ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gambhir: మైండ్ లెస్ గంభీర్.. అక్షర్ ను పంపే దమ్ముందా? భారత కోచ్ పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

gambhir: మైండ్ లెస్ గంభీర్.. అక్షర్ ను పంపే దమ్ముందా? భారత కోచ్ పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

Chandu Shanigarapu HT Telugu
Published Feb 10, 2025 04:53 PM IST

gambhir: భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ పై మాజీ క్రికెటర్ దొడ్డ గణేష్ సెన్సేషనల్ కామెంట్లు చేశారు. కేఎల్ రాహుల్ ను కాదని బ్యాాటింగ్ ఆర్డర్లో అక్షర్ పటేల్ ను ముందు పంపడాన్ని మైండ్ లెస్ ప్రయోగమంటూ మండిపడ్డాడు.

 భారత క్రికెట్ జట్టు కోచ్ గంభీర్ పై విమర్శలు
భారత క్రికెట్ జట్టు కోచ్ గంభీర్ పై విమర్శలు (PTI)

మైండ్ లెస్ ప్రయోగం

ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో భారత బ్యాటింగ్ ఆర్డర్ లో కేఎల్ రాహుల్ కంటే ముందు అక్షర్ పటేల్ ను పంపించడం మైండ్ లెస్ ప్రయోగమంటూ మాజీ క్రికెటర్ దొడ్డ గణేష్ విరుచుకుపడ్డాడు. టీమ్ఇండియా కోచ్ గంభీర్ మైండ్ లెస్ అనే అర్థం వచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యాటింగ్ కు కష్టమైన పిచ్ పై ఇలాగే చేసే దమ్ముందా అని ప్రశ్నించాడు.

అక్షరే ముందు

ఇంగ్లండ్ తో జరిగిన రెండు వన్డేల్లోనూ భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్ ల్లోనూ భారత బ్యాటింగ్ ఆర్డర్లో రాహుల్ కంటే ముందుగా అక్షర్ అయిదో స్థానంలో ఆడాడు. రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. దీంతో రాహుల్ ను డీమోట్ చేస్తున్నారంటూ ఇప్పటికే ఫ్యాన్స్ నుంచి టీమ్ మేనేజ్ మెంట్ పై విమర్శలు వస్తున్నాయి.

ఇలాగే చేస్తారా?

గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ దొడ్డ గణేష్ ప్రశ్నించాడు. ‘‘మళ్లీ కేఎల్ రాహుల్ కంటే ముందు అక్షర్ బ్యాటింగ్ కు వెళ్లాడు. నాకు మాటలు రావడం లేదు. రాహుల్ లాంటి జెన్యూన్ బ్యాటర్ ను ఆరో స్థానంలోకి నెట్టడంలో ఏమైనా అర్థం ఉందా? జట్టు 5/3తో ఉన్నప్పుడు కష్టమైన పిచ్ పై ఇలాగే అక్షర్ ను పంపే ధైర్యముందా? అది లేకపోతే ఈ ప్రయోగంలో అర్థం లేదు. ఇది మైండ్ లెస్’’ అని ఎక్స్ లో గణేష్ పోస్టు చేశాడు.

అక్షర్ అదుర్స్

అయిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఈ రెండు మ్యాచ్ ల్లోనూ అక్షర్ రాణించాడు. వరుసగా 52, 41* పరుగులు చేశాడు. మరోవైపు రాహుల్ మాత్రం ఆరో స్థానంలో విఫలమయ్యాడు. ఈ రెండు మ్యాచ్ ల్లో అతను వరుసగా 2, 10 పరుగులే చేశాడు. గతంలో రెండు సార్లు మాత్రమే వన్డేల్లో అతను ఆరో స్థానంలో ఆడాడు. అప్పడూ ఫెయిలయ్యాాడు.

Whats_app_banner

సంబంధిత కథనం