ఇండియా లేకుండా ఫస్ట్ డబ్ల్యూటీసీ ఫైనల్.. నేటి నుంచే ఆసీస్, సౌతాఫ్రికా పోరు.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?-australia vs south africa world test championship 2025 final aus vs sa test today starts wtc last match ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఇండియా లేకుండా ఫస్ట్ డబ్ల్యూటీసీ ఫైనల్.. నేటి నుంచే ఆసీస్, సౌతాఫ్రికా పోరు.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?

ఇండియా లేకుండా ఫస్ట్ డబ్ల్యూటీసీ ఫైనల్.. నేటి నుంచే ఆసీస్, సౌతాఫ్రికా పోరు.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. టెస్టు విశ్వవిజేత ఎవరో తెలిసేందుకు సమయం ఆసన్నమైంది. నేడే డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ ఆరంభం. ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడుతోంది. టీమిండియా లేకుండా జరుగుతున్న ఫస్ట్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఇదే. మరి ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చనే స్ట్రీమింగ్ వివరాలు ఇవే.

దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా, ఆస్ట్రేలియా సారథి కమిన్స్ (ICC)

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025 ఫైనల్ కు రంగం సిద్ధమైంది. ఈ రోజే డబ్ల్యూటీసీ టైటిల్ పోరు స్టార్ట్ కాబోతోంది. బుధవారం (జూన్ 11) ఆరంభమయ్యే ఈ మెగా టెస్టు సమరంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడుతోంది. టీమిండియా లేకుండా జరగబోతోన్న ఫస్ట్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఇదే.

టీమిండియా రన్నరప్

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో వరుసగా రెండు సార్లు ఫైనల్ చేరిన భారత్ రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 2021లో న్యూజిలాండ్ చేతిలో, 2023లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడింది. ఈ మూడో డబ్ల్యూటీసీ ఫైనల్ కు భారత్ అర్హత సాధించలేకపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో ఫస్ట్ టైమ్ ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా తలపడుతోంది.

ఎవరిదో పైచేయి

వరుసగా రెండో సారి టెస్టు టైటిల్ దక్కించుకోవాలనే లక్ష్యంతో ఆసీస్.. ఈ మెగా టెస్టు గదను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో సౌతాఫ్రికా రీ టీమ్ ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి. క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్ లో ఈ మ్యాచ్ జరుగుతోంది. తొలి డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు దక్కించుకునేందుకు అద్భుత విజయాలు సాధించిన ప్రొటీస్ జట్టుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి.

స్ట్రీమింగ్ వివరాలు

ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ 2025 ఎక్కడ జరుగుతుంది?

లండన్ లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ 2025 ఎప్పుడు?

ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ 2025 జూన్ 11న ప్రారంభమై 2025 జూన్ 15 వరకు జరగనుంది.

ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ 2025 ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ 2025 ఇండియా టైమ్ ప్రకారం మధ్యాహ్నం 3:00 గంటలకు (ఇంగ్లాండ్ కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు) ప్రారంభమవుతుంది.

ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ 2025 భారతదేశంలో ఎక్కడ ప్రసారం అవుతుంది?

ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ 2025 భారతదేశంలో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్ లో ప్రసారం కానుంది.

ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ 2025 భారత్ లో డిజిటల్ ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ జరుగుతుంది?

ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ 2025 భారతదేశంలోని జియో హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.