Australia Team: ఆ ఆరుగురు స్టార్ ప్లేయర్స్ ఇంటికి.. ఇండియా సిరీస్ లైట్ తీసుకుంటున్న ఆస్ట్రేలియా-australia team to send 6 world cup stars home after 3rd t20i against india ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Australia Team To Send 6 World Cup Stars Home After 3rd T20i Against India

Australia Team: ఆ ఆరుగురు స్టార్ ప్లేయర్స్ ఇంటికి.. ఇండియా సిరీస్ లైట్ తీసుకుంటున్న ఆస్ట్రేలియా

Hari Prasad S HT Telugu
Nov 28, 2023 12:30 PM IST

Australia Team: టీమిండియాతో టీ20 సిరీస్ ను ఆస్ట్రేలియా లైట్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. మంగళవారం (నవంబర్ 28) మూడో టీ20 ముగిసిన తర్వాత వరల్డ్ కప్ ఆడిన ఆరుగురు స్టార్ ప్లేయర్స్ ను ఇంటికి పంపించేస్తోంది.

మూడో టీ20కి ముందే ఆస్ట్రేలియా వెళ్లిపోయిన స్టీవ్ స్మిత్
మూడో టీ20కి ముందే ఆస్ట్రేలియా వెళ్లిపోయిన స్టీవ్ స్మిత్ (PTI)

Australia Team: ఆస్ట్రేలియా టీమ్ టీమిండియాతో జరగబోయే మూడో టీ20 తర్వాత తమ టీమ్ ను పూర్తిగా మార్చేస్తోంది. ఏకంగా ఆరుగురు ప్లేయర్స్ ను ఇంటికి పంపించేసి వాళ్ల స్థానంలో కొత్త ప్లేయర్స్ ను తీసుకొస్తోంది. ఈ ఆరుగురు ప్లేయర్స్ వరల్డ్ కప్ ఆడిన వాళ్లే. ఫైనల్లో సెంచరీతో ఇండియా కొంప ముంచిన స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ తప్ప మిగిలిన వాళ్లంతా ఇంటికెళ్లిపోనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

మంగళవారం (నవంబర్ 28) టీమిండియాతో మూడో టీ20 ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ఆస్ట్రేలియా తమ జట్టులో ఈ మార్పులు చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. ఇప్పటికే స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, స్పిన్నర్ ఆడమ్ జంపా ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. ఈ ఇద్దరూ మూడో టీ20కి కూడా అందుబాటులో ఉండటం లేదు. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టాయినిస్, సీన్ అబాట్, జోష్ ఇంగ్లిస్ కూడా వెళ్లిపోనున్నారు.

గౌహతిలో మంగళవారం మూడో టీ20 ముగిసిన తర్వాత డిసెంబర్ 1న రాయ్‌పూర్ లో నాలుగో టీ20, డిసెంబర్ 3న బెంగళూరులో ఐదో టీ20 జరగనున్నాయి. ఏకంగా ఆరుగురు స్టార్ ప్లేయర్స్ దూరమైన తర్వాత ఆస్ట్రేలియా టీమ్ బలహీనంగా మారింది. వాళ్ల స్థానంలో కొత్త వాళ్లు టీమ్ తో చేరనున్నారు. ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచిన ఇండియన్ టీమ్.. మూడో టీ20 గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది.

ఈ మ్యాచ్ కు ముందు వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఫిలిప్, బెన్ మెక్‌డెర్మాట్ ఆస్ట్రేలియా టీమ్ తో చేరారు. వీళ్లు మూడో మ్యాచ్ కు అందుబాటులో ఉంటారు. మూడో మ్యాచ్ ముగిసిన తర్వాత ఫాస్ట్ బౌలర్ బెన్ డ్వార్‌షుయిస్, స్పిన్నర్ క్రిస్ గ్రీన్ కూడా టీమ్ తో చేరతారు. తమ స్టార్ ప్లేయర్స్ ను ఎందుకు ఇంటికి పంపించేసిందో ఆస్ట్రేలియా టీమ్ వెల్లడించలేదు.

అయితే నెలన్నర పాటు మెగా టోర్నీలో ఆడి మానసికంగా, శారీరకంగా అలసిపోయిన ఈ స్టార్ ప్లేయర్స్ కు కాస్త విశ్రాంతి అవసరం అని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. కొత్త ప్లేయర్స్ చేరిన తర్వాత ఆస్ట్రేలియా టీమ్ పూర్తి కొత్త లుక్ లో కనిపిస్తోంది.

ఆస్ట్రేలియా టీ20 టీమ్ ఇదే

మాథ్యూ వేడ్ (కెప్టెన్), జేసన్ బెహ్రెండార్ఫ్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షూయిస్, నేథన్ ఎలిస్, క్రిస్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, జోష్ ఫిలిప్, తన్వీర్ సంఘా, మ్యాట్ షార్ట్, కేన్ రిచర్డ్‌సన్

WhatsApp channel