Starc IPL: భారత ఫిక్స్ఇట్ ఎవరో తెలుసా? మిచెల్ స్టార్క్ ఏం చెప్పాడో చూసేయండి..అతనితో ఆడేందుకు ఉత్సాహంగా ఉందంటూ కామెంట్లు
Starc IPL: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. భారత ఫిక్స్ఇట్ ఆటగాడు అతడే అని పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ ప్లేయర్ పై స్టార్క్ ప్రశంసలు కురిపించాడు. మరి ఆ ఆటగాడు ఎవరో చూసేయండి.
ఇండియన్ ప్రిమియర్ లీగ్ గ్ (ఐపీఎల్) 2025 సీజన్లో భారత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ తో కలిసి ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నానని ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అన్నాడు. గత ఏడాది చివర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో రాహుల్, స్టార్క్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2025 సీజన్లో ఈ ఇద్దరు ఢిల్లీకి ఆడబోతున్నారు. కొత్త సీజన్ కోసం సిద్ధమవుతున్నారు.
అతను అన్నీ చేస్తాడు
భారత క్రికెట్ కు కేెఎల్ రాహుల్ మిస్టర్ ఫిక్స్ఇట్ లాంటివాడు అని స్టార్క్ ప్రశంసలు కురిపించాడు. జట్టు కోసం రాహుల్ అన్నీ చేస్తాడని పేర్కొన్నాడు.
‘‘కేఎల్ రాహుల్ భారత్ కు మిస్టర్ ఫిక్స్ఇట్ లాంటివాడు. అతను అడిగినప్పుడు ఓపెనింగ్ బ్యాటింగ్ చేశాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. ఫీల్డింగ్ చేశాడు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేశాడు.. ఇలా అతను ప్రతీదీ చేస్తూనే ఉన్నాడు. భారత విజయాల్లో కీలక రాహుల్ కీలక పాత్ర పోషించాడు. అతనితో కలిసి ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నా’’ అని ఫానాటిక్స్ టీవీ యూట్యూబ్ ఛానెల్లో స్టార్క్ చెప్పాడు.
కీ రోల్
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయంలో కేఎల్ రాహుల్ కీ రోల్ ప్లే చేశాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన అతను 140 పరుగులు సాధించాడు. ఆడిన అయిదు ఇన్నింగ్స్ ల్లో మూడింట్లో నాటౌట్ గా నిలిచాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ తో ఫైనల్లో 33 బంతుల్లో 34 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే ప్రస్తుతం భారత టీ20, టెస్టు జట్టులో మాత్రం రాహుల్ కు చోటు దక్కడం లేదు.
టెస్టుల్లో పంత్ వికెట్ కీపర్ బ్యాటర్ గా ఆడుతున్నాడు. టీ20లకు వచ్చే సరికి సంజు శాంసన్ ఉన్నాడు. అందుకే రాహుల్ కు కేవలం వన్డేల్లోనే ఆడే ఛాన్స్ దక్కుతోంది. ఆ అవకాశాన్ని అతను వంద శాతం ఉపయోగించుకుంటున్నాడు.
భారత్ కు అడ్వాంటేజ్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ కు అడ్వాంటేజ్ ఉందని అందరూ అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఈ టోర్నీ కోసం పాక్ కు వెళ్లేందుకు ఇండియా నిరాకరించడంతో అన్ని మ్యాచ్ లను దుబాయ్ స్టేడియంలోనే టీమ్ ఆడింది. దీంతో ఇండియాకు మిగతా జట్ల కంటే అడ్వాంటేజ్ ఉందనే కామెంట్లు బలంగా వినిపించాయి.
‘‘యూఏఈలో టీ20 లీగ్ లో ఆడిన ఆటగాళ్లు దుబాయ్ లో ఎక్కువ మ్యాచ్ లాడారు. వాళ్లకు అక్కడి పరిస్థితులు తెలుసు. కానీ భారత ఆటగాళ్లు మాత్రమే ఐపీఎల్ లో ఆడుతున్నారు. దీంతో భారత్ కు పెద్ద ప్రయోజనం ఉందో లేదో తనకు తెలియదు’’ అని స్టార్క్ పేర్కొన్నాడు. ళ్లు ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నందున భారత్కు పెద్ద ప్రయోజనం ఉందో లేదో తనకు తెలియదని స్టార్క్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ లో మాత్రమే
‘‘భారత ఆటగాళ్లకు ఛాంపియన్స్ ట్రోఫీలో అడ్వాంటేజ్ ఉంటుందంటే నమ్మకం లేదు. ఎందుకంటే మిగతా వాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఇతర లీగ్ ల్లో ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడుతున్నారు. కానీ భారత ఆటగాళ్లు కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నారు. ఐపీఎల్ అనేది నంబర్ వన్ లీగ్. ఇక్కడ 10 వారాల పాటు హై క్లాస్ క్రికెట్ ఆడతారు’’ అని స్టార్క్ అన్నాడు.
సంబంధిత కథనం