AUS vs SA Semi Final Rain: సెమీఫైనల్‍కు వర్షం ఆటంకం.. పీకల్లోతు కష్టాల్లో దక్షిణాఫ్రికా
AUS vs SA Semi Final Rain: వన్డే ప్రపంచకప్ రెండో సెమీఫైనల్‍కు వర్షం ఆటంకం కలిగించింది. టాపార్డర్ విఫలమై దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో వరుణుడి ఎంట్రీ ఇచ్చాడు. వివరాలివే.
AUS vs SA World Cup 2023 Semi Final Rain: వన్డే ప్రపంచకప్ 2023 రెండో సెమీఫైనల్‍కు వరుణుడు ఆటంటం కలిగించాడు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తుండగా వర్షం పడింది. టాపార్డర్ విఫలమై దక్షిణాఫ్రికా కష్టాల్లో ఉన్న సమయంలో వాన వచ్చింది. ఆస్ట్రేలియా పేసర్ల జోరును ఆపింది. కోల్‍కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో నేడు (నవంబర్ 16) ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచకప్ రెండో సెమీఫైనల్‍లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. వెంటవెంటనే వికెట్లు కోల్పోయి సఫారీ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వాన రంగప్రవేశం చేసింది. వివరాలివే..

14 ఓవర్లలో 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా తడబడింది. ఆస్ట్రేలియా పేసర్లు జోస్ హాజిల్‍వుడ్, మిచెల్ నిప్పులు చెరిగే బంతులు వేసి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (0) తొలి ఓవర్లోనే స్టార్క్ బౌలింగ్‍లో ఔటై మరోసారి విఫలమయ్యాడు. క్వింటన్ డికాక్ (3), ఐడెన్ మార్క్ రమ్ (10) రాసీ వాండర్ డుసెన్ (6) కూడా ఎక్కువసేపు నిలువలేకపోయారు. హెన్రిచ్ క్లాసెన్ (8 నాటౌట్), డేవిడ్ మిల్లర్ (10 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
14 ఓవర్లు ముగిశాక డ్రింక్స్ బ్రేక్ రాగా.. అప్పుడు వాన ఎంట్రీ ఇచ్చింది. దీంతో అంపైర్లు ఆట ఆపేశారు. జోరుగా వర్షం కురుస్తోంది. గ్రౌండ్‍ను కవర్లతో కప్పారు మైదానం సిబ్బంది. వాన తగ్గాక పరిస్థితిని పరిశీలించి ఆట కొనసాగింపుపై అంపైర్లు నిర్ణయం తీసుకుంటారు.
తొలి సెమీస్‍లో న్యూజిలాండ్‍పై గెలిచి వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‍కు టీమిండియా ఇప్పటికే చేరుకుంది. దీంతో ఈ రెండో సెమీస్‍లో గెలిచిన జట్టుతో నవంబర్ 19న ఫైనల్‍లో భారత్ తలపడుతుంది.