Ashwin: అందుకే నన్ను రోహిత్ జట్టులోకి తీసుకోలేదు - వరల్డ్ కప్‌లో ఛాన్స్‌లు రాకపోవడంపై అశ్విన్ కామెంట్స్
Ashwin: వరల్డ్ కప్‌లో తనకు ఛాన్స్‌లు రాకపోవడంపై అశ్విన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చకూడదనే కెప్టెన్ రోహిత్ శర్మ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపాడు.
Ashwin: ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్‌కు టీమిండియా సీనియర్ పేసర్ అశ్విన్ కూడా సెలక్ట్ అయ్యాడు. కానీ అతడికి ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే ఛాన్స్ రాలేదు. అశ్విన్‌ను కాదని కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజానే అన్ని మ్యాచ్‌లు ఆడించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.

ఫైనల్‌తో పాటు కొన్ని మ్యాచ్‌లలో కుల్దీప్, జడేజా దారుణంగా విఫలమయ్యారు. ధారాళంగా పరుగులు ఇచ్చారు. అయినా అశ్విన్‌ను కాదని వీరిద్దరినే జట్టులో కొనసాగించడంపై విమర్శలొచ్చాయి. అశ్విన్ తుది జట్టులో ఉంటే ఫైనల్‌లో బౌలింగ్ పరంగా టీమిండియా స్ట్రాంగ్‌గా మారేదని, ఫలితం మరోలా వచ్చే అవకాశాలు ఉండేవని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.
ఈ కామెంట్స్‌పై అశ్విన్ స్పందించాడు. రోహిత్ శర్మకు సపోర్ట్ చేశాడు. విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చడానికి ఏ కెప్టెన్ అయినా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాడని, రోహిత్ కూడా అలాగే ఆలోచించి తనకు అవకాశాలు ఇవ్వలేదని తెలిపాడు.
“వరల్డ్ కప్‌లో జట్టు కూర్పు బాగా కుదిరింది. అలాంటి విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చాలని ఏ కెప్టెన్ అనుకోడు. రోహిత్ స్థానంలో నేను ఉన్నా అదే చేసేవాడిని. అవకాశాలు ఇవ్వడం లేదని అనుకోవడం కెప్టెన్ ఏం ఆలోచిస్తాడన్నది అతడి స్థానంలో ఉండి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం” అని అశ్విన్ అన్నాడు. అతడి కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
వరల్డ్ కప్‌లో పది విజయాలతో ఫైనల్ చేరింది టీమిండియా. తుది పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై రన్నరన్ ట్రోఫీతో సరిపెట్టుకుంది.