india vs england 3rd odi live: బ్రెయిన్ వాడావ్.. శభాష్ అర్ష్ దీప్.. రోహిత్ ఇంప్రెస్.. ట్రాప్ లో డకెట్
india vs england 3rd odi: ఇంగ్లండ్ తో మూడో వన్డేలో టీమ్ఇండియా పేసర్ అర్ష్ దీప్ స్మార్ట్ బౌలింగ్ తో అదరగొట్టాడు. డకెట్ ను ట్రాప్ లో బిగించాడు. అర్ష్ దీప్ వికెట్ కు కెప్టెన్ రోహిత్ ఇంప్రెస్ అయ్యాడు.

భారత క్రికెట్ జట్టు పేసర్ అర్ష్ దీప్ సింగ్ స్మార్ట్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ తో మూడో వన్డేలో బ్రెయిన్ పెట్టి టీమ్ఇండియాకు కీలక వికెట్ అందించాడు. ఇంగ్లండ్ ఓపెనర్ డకెట్ ను ట్రాప్ లోకి లాగాడు. నకుల్ బంతిని స్లో గా వేసి వికెట్ రాబట్టాడు. అర్ష్ దీప్ బౌలింగ్ కు కెప్టెన్ రోహిత్ ఇంప్రెస్ అయ్యాడు.
వరుసగా ఫోర్లు
అహ్మదాబాద్ లో బుధవారం (ఫిబ్రవరి 12) జరుగుతున్న మూడో వన్డేలో 357 ఛేజింగ్ లో ఇంగ్లండ్ మొదట్లో దూకుడు ప్రదర్శించింది. ముఖ్యంగా డకెట్ బౌండరీల మీద బౌండరీలు బాదాడు. ఈ సిరీస్ లో తొలి వన్డే ఆడుతున్న అర్ష్ దీప్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్లో డకెట్ వరుసగా 4 ఫోర్లు కొట్టాడు. ఆ సమయంలో కెప్టెన్ రోహిత్, అర్ష్ దీప్ ఫ్రస్టేట్ అయ్యారు. డకెట్ 22 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు.
ట్రాప్ లోకి లాగి
వరుసగా నాలుగు ఫోర్లు ఇచ్చుకున్న తర్వాత అర్ష్ దీప్ తెలివిగా ఆలోచించాడు. గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడుతున్న డకెట్ ను స్లో డెలివరీస్ తో కట్టడి చేయాలని చూశాడు. తన తర్వాతి ఓవర్లో అదే వ్యూహాన్ని అమలు చేశాడు. స్లోగా నకుల్ బాల్ వేశాడు. టెంప్ట్ అయిన డకెట్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ షాట్ గురి తప్పింది. బంతి గాల్లోకి లేవడంతో మిడాఫ్ లో ఉన్న రోహిత్ క్యాచ్ అందుకున్నాడు. బంతిని అందుకున్న తర్వాత ‘‘గుడ్.. బుర్ర వాడావ్’’ అనే అర్థం వచ్చేలా రోహిత్ చేతితో తలను చూపించాడు.
గెలుపు దిశగా భారత్
ఇప్పటికే సిరీస్ ను 2-0తో గెలిచిన భారత్.. మూడో వన్డేలోనూ గెలుపు దిశగా సాగుతోంది. ఛేజింగ్ ను దూకుడుగా ఆరంభించిన ఇంగ్లండ్ 6 ఓవర్లకే 60/0తో నిలిచింది. కానీ అర్ష్ దీప్ తన వరుస ఓవర్లలో డకెట్, ఫిల్ సాల్ట్ (23)ను ఔట్ చేయడంతో భారత్ పట్టు బిగించింది. ఆ తర్వాత బౌలర్లు కట్టుదిట్టంగా రాణిస్తున్నారు. ప్రస్తుతం 26 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 156/5తో నిలిచింది.