T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‍కు ఏ జట్లు వెళతాయో చెప్పిన గవాస్కర్, రాయుడు, హేడెన్, లారా
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ సమీపిస్తోంది. ఈ తరుణంలో ఈ మెగాటోర్నీలో సెమీఫైనల్‍కు ఏ జట్లు వెళతాయో కొందరు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
T20 World Cup 2024: ఐపీఎల్ 2024 ముగిసింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2024 ఫీవర్ మొదలైపోయింది. జూన్ 2 నుంచి జూన్ 29వ తేదీ వరకు ఈ మెగాటోర్నీ జరగనుంది. వెస్టిండీస్, అమెరికా వేదికలుగా ప్రపంచకప్ సాగనుంది. క్రికెట్ ప్రేమికుల దృష్టి అంతా ఇప్పుడు ఈ మెగాటోర్నీపై ఉంది. ఈ తరుణంలో టీ20 ప్రపంచకప్‍లో సెమీఫైనల్స్‌కు ఏ జట్లు వెళతాయని తాము భావిస్తున్నారో కొందరు మాజీ క్రికెటర్లు వెల్లడించారు. సెమీస్ కోసం తాము అనుకుంటున్న నాలుగు జట్లను చెప్పారు.
మాజీలు క్రికెటర్లు సునీల్ గవాస్కర్, మహమ్మద్ కైఫ్, అంబటి రాయుడు, బ్రియాన్ లారా, మాథ్యూ హెడెన్, శ్రీశాంత్ సహా మరికొందరు ప్రపంచకప్ సెమీస్ జట్లను ఎంపిక చేసుకున్నారు. స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌పర్ట్స్‌గా ఉన్న వీరు తమ అభిప్రాయాలు చెప్పారు.
మాజీలు చెప్పిన జట్లు ఇవే
సునీల్ గవాస్కర్: టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ సెమీఫైనల్ చేరతాయని టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పారు.
అంబటి రాయుడు: ఇండియాతో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా సెమీస్‍కు వెళతాయని అంబటి రాయుడు అంచనా వేశారు.
బ్రియాన్ లారా: ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‍లో భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ సెమీస్ చేరతాడని వెస్టిండీస్ మాజీ లెజెండ్ బ్రియాన్ లారా అన్నారు. అఫ్గాన్ పేరు చెప్పిన కాస్త ఆశ్చర్యపరిచారు.
పౌల్ కాలింగ్‍వుడ్: ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇండియా సెమీస్ ఆడతాయని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కౌలింగ్‍వుడ్ అన్నారు.
క్రిస్ మోరిస్: ఐపీఎల్ ఆడి ఫుల్ ఫామ్‍లో ఉన్న భారత్.. టీ20 ప్రపంచకప్ సెమీస్ తప్పకుండా చేరుతుందని అనుకుంటున్నానని దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ క్రిస్ మోరిస్ చెప్పారు. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా కూడా సెమీస్ ఆడతాయని అంచనా వేశారు.
మాథ్యూ హేడెన్: టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా సెమీస్ చేరతాయని ఆసీస్ మాజీ డ్యాషింగ్ ఓపెనర్ మాథ్యూ హేడెన్ అభిప్రాయపడ్డారు.
మహమ్మద్ కైఫ్: భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సెమీస్ వెళతాయని భారత మాజీ బ్యాటర్ మహమ్మద్ కైఫ్ చెప్పారు.
టామ్ మూడీ: ఆస్ట్రేలియా, ఇండియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్ వెళతాయని ఆసీస్ మాజీ ప్లేయర్ టామ్ మూడీ తెలిపారు.
శ్రీశాంత్: టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సెమీస్ చేరతాయని మాజీ పేసర్ శ్రీశాంత్ అంచనా వేశారు.
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో టీమిండియా సెమీస్ చేరుతుందని స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌పర్ట్స్‌గా ఉన్న ఈ మాజీలందరూ అంచనా వేశారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‍కు కూడా చాలా మంది ఓటేశారు.
ఈసారి 20 జట్లు
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‍లో 20 జట్లు తలపడనున్నాయి. ఓ వరల్డ్ కప్‍లో 20 టీమ్‍లు ఆడడం ఇదే తొలిసారి. గ్రూప్ దశ మ్యాచ్‍లు అమెరికా, వెస్టిండీస్‍ల్లో సంయుక్తంగా జరగనున్నాయి. ఆ తర్వాత సూపర్-8, సెమీస్, ఫైనల్స్ వెస్టిండీస్‍లోనే జరగనున్నాయి. మొత్తంగా 55 మ్యాచ్‍లు జరుగుతాయి.
టీ20 ప్రపంచకప్ 2024 కోసం కెప్టెన్ రోహిత్ శర్మ సహా కొందరు భారత ఆటగాళ్లు అమెరికా చేరుకున్నారు. త్వరలో మిగిలిన వారు వెళతారు. ఈ టోర్నీలో తన తొలి మ్యాచ్‍ను జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‍తో ఆడనుంది టీమిండియా. జూన్ 9న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఉంటుంది.