Virat Kohli: కోహ్లి కెప్టెన్సీలో టీమిండియాలోకి ఎంట్రీ -టాలెంట్ ఉండి ఎక్కువ మ్యాచ్‌లు ఆడని తెలుగు క్రికెటర్లు వీళ్లే!
Virat Kohli: కోహ్లి కెప్టెన్సీలో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు తెలుగు క్రికెటర్లు టాలెంట్ ఉండి కూడా జాతీయ జట్టులో ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు.ఆ క్రికెటర్లు ఎవరంటే?
Virat Kohli: టీమిండియా తరఫున ఆడాలని ప్రతి క్రికెటర్ కలలు కంటుంటాడు. కానీ కొందరు మాత్రమే ఆ కలలను నిజం చేసుకుంటారు. ఇండియన్ టీమ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఓ ఎత్తయితే.. జట్టులో స్థానాన్ని పదిలం చేసుకోవడానికి అంతకు పదింతలు కష్టపడాల్సివుంటుంది. ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ లో టీమిండియాలో ఎంట్రీ ఇవ్వడమే ఛాలెంజింగ్‌గా మారిపోయింది. టాలెంట్ ఉండి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న క్రికెటర్లు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు. ఈ ప్రయత్నంలో కొందరు కొన్ని మ్యాచ్‌లు ఆడి కనుమరుగైతే...మరికొందరు క్రికెటర్లు మాత్రం తమ ఆటతీరుతో పాటు అదృష్టంతో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంటారు.
కోహ్లి కెప్టెన్సీలో...
కోహ్లి కెప్టెన్సీలో నేషనల్ టీమ్‌లోకి అరంగేట్రం చేసిన తెలుగు క్రికెటర్లు అంబటి రాయుడు, ప్రజ్ఞాన్ ఓజా టాలెంట్ ఉండి ఎక్కువ కాలం టీమిండియాలో కొనసాగలేకపోయారు.
అన్‌లక్కీ క్రికెటర్...
ఇండియన్ క్రికెట్‌లో మోస్ట్ అన్‌లక్కీయెస్ట్ ప్లేయర్‌గా అంబటిరాయుడును చెబుతారు. అంబటిరాయుడు క్రికెటర్ జర్నీ మొత్తం ఎన్నో సవాళ్లు, అడ్డంకులతోనే సాగింది. 2013లో జింబాబ్వే తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా టీమిండియాలోకి అంబటిరాయుడు ఎంట్రీ ఇచ్చాడు. ఆ టోర్నీలో టీమిండియాకు కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే 63 పరుగులతో అంబటిరాయుడు సత్తా చాటాడు. ఆ తర్వాత జట్టులోకి అడపాదడపా వచ్చి పోయిన రాయుడు 2019లో టీమిండియా తరఫున చివరి వన్డే ఆడాడు.
ఆరేళ్లలో కేవలం 55 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడిన రాయుడు 47.05 యావరేజ్‌తో 1694 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, పది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్‌తో అనేక సార్లు తాను ఎంత విలువైన ఆటగాడో చాటిచెప్పిన బీసీసీఐ సెలెక్టర్లు మాత్రం అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. టీ20 ఫార్మెట్‌లో టీమిండియా తరఫున ఆరు మ్యాచ్‌ల్లో మాత్రమే అతడికి అవకాశం దక్కింది. టీమిండియా కంటే ఐపీఎల్‌లోనే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు అంబటి రాయుడు. ఐపీఎల్ లో 175 మ్యాచుల్లో 3916 రన్స్ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన ఆటగాళ్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు.
హైదరాబాదీ స్పిన్నర్...
మరో హైదరాబాదీ ప్లేయర్ ప్రజ్ఞాన్ ఓజా కూడా కోహ్లి కెప్టెన్సీలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. 2009లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా జాతీయ జట్టులోకి ఈ స్పిన్నర్ అరంగేట్రం చేశాడు. ఆరంభంలో ఓజా బౌలింగ్‌తో మెరుపులు మెరిపించినా అశ్విన్, జడేజా రాకతో అతడి ప్రతిభ మరుగున పడిపోయింది.
ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ఓజా ఇంటర్నేషనల్ కెరీర్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు ఓజా. టీమిండియా తరఫున 24 టెస్ట్‌లు ఆడిన ఓజా 113 వికెట్లు తీశాడు. పది వికెట్ల ప్రదర్శనను ఓ సారి, ఐదు వికెట్లను ఏడుసార్లు తీసుకున్నాడు. టెస్టులతో పాటు పద్దెనిమిది వన్డేలు, ఆరు టీ20 మ్యాచుల్లో టీమిండియా తరఫున ఓజా బరిలో దిగాడు.
టాపిక్